Breaking News

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు

Published on Tue, 01/07/2025 - 00:15

హనుమకొండ అర్బన్‌/నయీంనగర్‌: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా మని రెవెన్యూ, గృహ ని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేస్తే కూడా ఓర్వలేక ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. సోమవారం హనుమకొండ కుడా మైదానంలో వరంగల్‌ రీజియన్‌కు కేటాయించిన టీజీఆర్‌టీసీ 50 ఎలక్ట్రిక్‌ బస్సులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి పొంగులేటి ప్రారంభించారు. అదేవిధంగా హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ, గత ప్ర భుత్వం కుట్రపూరితంగా ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని చూసిందని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో పరిపుష్టం చేసి, కార్మికులకు భద్రత కల్పించామన్నారు. ధర ణిని ప్రక్షాళన చేసి కొత్త చట్టం తీసుకువచ్చామని, దీనిద్వారా తెలంగాణలో ఉన్న 2 కోట్ల 77లక్షల ఎకరాల ఆసాములకు పూర్తి భద్రత కలి్పస్తున్నామని పే ర్కొన్నారు. గత ప్రభుత్వం కనీసం లక్ష ఇళ్లు కూడా నిర్మించలేదని, తమ ప్ర భుత్వంలో మొదటి విడతగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. మిగతా నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు.

అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కూడా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులు ఉంటే మండల కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.  మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా ఆంబోతులను పంపుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు గతంలో తొంటి ఇరుగుడు నిజమా అబద్ధమా తెలియదు.. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి ఏమైందని ఆయన ప్రశ్నించారు. సాగు చేసే ప్రతీ భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)