Breaking News

త్వరలో కొత్త స్టాంపుల విధానం

Published on Sun, 07/06/2025 - 04:32

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించకుండా, వ్యాపార ఒప్పందాల విషయంలో పారదర్శకత ఉండేలా రాష్ట్రంలో కొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా భారతీయ స్టాంపుల చట్టాన్ని అనుసరించి వచ్చే శాసనసభ సమావేశాల్లోనే తెలంగాణ స్టాంపుల చట్టం సవరణ బిల్లు–2025ను ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ సవరణ బిల్లుపై శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్, న్యాయ వ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హన్మంతులు పాల్గొన్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో ఇందుకు సంబంధించి తెచ్చిన బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం, వాటిని నివృత్తి చేసిన తర్వాత కూడా తిప్పి పంపిన విషయాన్ని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన పొంగులేటి.. 2021లో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకుని, ప్రస్తుత కాలానికి అనుగుణంగా 2025 బిల్లును తీసుకువస్తామని చెప్పారు. కొత్త విధానం పకడ్బందీగా ఉండేలా బిల్లును రూపొందించాలని అధికారులను కోరారు.  

భూముల ధరల సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి 
    సామాన్య, మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్‌ విలువలకు అనుగుణంగా రాష్ట్రంలో భూముల ధరలను సవరించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలను సవరించేందుకు, హేతుబద్ధంగా పెంచేందుకు ఉన్న అవకాశాలపై లోతైన అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం ఎన్నో చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే ఆలోచన చేయాలని, కొత్త వాటితో పోలిస్తే పాత అపార్ట్‌మెంట్‌లకు కొంత వెసులుబాటు ఉండేలా ప్రతిపాదనలు చేయాలని సూచించారు. అన్ని అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)