Breaking News

వీఆర్వో, వీఆర్‌ఏలకు మరో అవకాశం

Published on Sun, 07/06/2025 - 05:21

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పాలనాధికారుల (జీపీవో) నియామకం కోసం పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు మరోసారి అవకాశం కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో ఆయన రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌. లోకేశ్‌కుమార్‌తో కలసి రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. ఇందులో జీపీవోల నియామకంపై సుదీర్ఘంగా చర్చించారు.

జీపీవోల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షలో 3,454 మంది అర్హులుగా ఎంపికయ్యారని అధికారులు వివరించగా, అనివార్య కారణాలతో కొందరు వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారు ఆ పరీక్షకు హాజరు కాలేదని, వారికి మరోమారు అవకాశం ఇవ్వాలని రెవెన్యూ సంఘాల నేతలు కోరారు. ఇందుకు మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.

పోటాపోటీగా వినతులు 
కాగా, మంత్రి పొంగులేటితో సమావేశమయ్యేందుకు వచ్చిన రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు పోటాపోటీగా వినతిపత్రాలు సమరి్పంచారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి.లచి్చరెడ్డి సారథ్యంలోని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకుల బృందం, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీ సెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలోని మరో బృందం పలు అంశాల పరిష్కారం కోరుతూ మంత్రిæకి విజ్ఞప్తి చేశాయి.

 మంత్రి పొంగులేటితో సమావేశమైన వారిలో ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, వివిధ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, పి.రాజ్‌కుమార్, నిరంజన్, రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆర్‌.రాంబాబు, కృష్ణచైతన్య, గరికపాటి ఉపేందర్‌రావు, లక్ష్మీనర్సింహ ఉన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)