Breaking News

కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు

Published on Sun, 09/07/2025 - 05:03

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/నందిగామ: ‘గత పాలకులకు పేదవాడి ఆ త్మగౌరవం పట్టలేదు. కమీషన్లు రావనే వారికి ఇళ్లు కట్టివ్వలేదు. అదే కమీషన్లు వస్తాయనే దురాశతో రూ.లక్షల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు.’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. శనివారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.

గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి పట్టాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయా సభల్లో పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్‌ సర్కార్‌ పేదోడి ప్రభుత్వమని.. వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల హయాంలో ఏ ఒక్కరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి సోమవారం దశల వారీగా నిర్మించిన మేరకు ఇళ్లకు నిధులు విడుదల చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఫౌండేషన్‌ కట్టనివి కొన్ని ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో దశలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేరు చేర్చేలా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్ప డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెనే కొరి వి దెయ్యంఅని.. ఇంకా బీఆర్‌ఎస్‌లో చాలా దెయ్యా లు ఉన్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)