Breaking News

రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం నీరివ్వలేదు

Published on Wed, 07/03/2024 - 04:48

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయితే, ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్‌ చేసి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని.. అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, బీరోలు, పోచారంలో సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అలాగే దమ్మాయిగూడెం నుంచి పోచారం వరకు నిర్మాణం జరుగుతున్న కాలువ, సొరంగం పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. 

అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండగా, ఇప్పటికే మొదటి లిఫ్ట్‌ ట్రయల్‌రన్‌ పూర్తిచేసి రెండో లిఫ్ట్‌ ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్నామని తెలిపారు.

మొదటి విడత ఆగస్ట్‌ 15న..
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మొదటి విడతగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయిస్తామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై ఎక్కడా నీటి నిల్వకు రిజర్వా యర్లు కట్టలేదని, దీంతో 10 టీఎంసీల నుంచి 12 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్‌ నిర్మించాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. 

కాగా, వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట డోర్నకల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రామ చంద్ర నాయక్, నీటిపారుదల శాఖ సీఈ విద్యాసాగర్‌ తదితరులు ఉన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)