Breaking News

‘ఆ ముగ్గురు మా వాళ్లే వదిలేయ్‌’

Published on Sun, 09/21/2025 - 11:36

ఖమ్మంక్రైం: ఖమ్మం బైపాస్‌రోడ్డులో ఓ ఎస్‌ఐ స్థాయి అధికారి ఇటీవల వాహన తనిఖీలు చేపడుతున్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తుండగా ఆపి పరిశీలించగా లైసెన్స్, ఆర్‌సీ లేదని.. అసలు వాహనమే తమది కాదని బదులిచ్చారు. దీంతో ఆ ఎస్‌ఐ వాహనాన్ని పక్కన పెట్టించారు. అయితే, యువకులు ఎవరికో ఫోన్‌ చేయగా.. కొద్దిసేపటికే అధికార పార్టీ కార్పొరేటర్‌ నుంచి  ఎస్‌ఐకి ఫోన్‌ వచ్చింది. ‘ఆ ముగ్గురు మా వాళ్లే వదిలేయ్‌’ అని సూచిస్తే ఎస్సై లైసెన్స్‌ లేదని చెబుతున్నా వినకుండా పై అధికారితో మాట్లాడుతానంటూ ఫోన్‌ కట్‌ చేశాడు.

 అనుకున్నట్టుగానే పై అధికారి నుంచి ఎస్సైకి ఫోన్‌ రావడంతో ఆ ముగ్గురిని వదిలేయగా ఒకే బండిపై ట్రిపుల్‌ రైడింగ్‌గా పోలీసుల ముందే కాలర్‌ ఎగురవేసుకుంటూ వెళ్లిపోయారు. అదే సమయాన ఎలాంటి పైరవీలు లేని కొందరు వాహనదారులు జరిమానా చెల్లించి వెళ్లారు. దీంతో సామాన్యులకు ఓ న్యాయం, పైరవీలు ఉంటే ఇంకో తీరేంటని నిట్టూర్చారు అక్కడున్నవారు. ఈ ఘటన ఒకటే కాదు.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని నాలుగు పోలీస్‌స్టేషన్లతో పాటు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిత్యం జరుగుతున్న తంతే ఇది.

చిన్న పాముకూ పెద్ద కర్రే
నిబంధనలకు విరుద్ధంగా డీజే పెట్టి నృత్యాలు చేసే వారిపై ఫిర్యాదు అందితే పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలిస్తారు. ఆ వెంటనే ఓ రాజకీయ నాయకుడు వచ్చి కీలక ప్రజాప్రతినిధికి దగ్గరి మనిషినంటూ డీజే వాహనం, నిర్వాహకులను తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. వాహనం బయటకు వెళ్లగానే మళ్లీ పాటలతో హోరెత్తిస్తుండడంతో పోలీసులు ఉసూరుమనడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇక ద్విచక్ర వాహనాలను ఆపినా, జరిమానా కట్టాలని అడిగినా కొందరు రాజకీయ నాయకులు రంగంలోకి దిగుతుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటుండగా.. ఇలాంటి వారితో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు సమాధానం చెప్పలేకపోతున్నామని వారు మథనపడుతున్నారు. 

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)