Breaking News

‘ప్లేట్‌’ ఫిరాయిస్తే కేసే!

Published on Fri, 07/05/2024 - 05:28

ట్రాఫిక్‌ ఉల్లంఘనులు నగరంలో రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్‌ కెమెరాలకు
తమ వాహన నంబర్‌ చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్‌’ చేస్తున్నారు. దీనికోసం నంబర్‌ ప్లేట్స్‌కు మాస్కులు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. 

అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, స్నాచింగ్స్, చోరీలకు పాల్పడేవారు సైతం ఇదే బాటపట్టడంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్‌ ప్లేట్స్‌ మూసేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలోనే 35 కేసులు నమోదు చేయించారు.   - సాక్షి, హైదరాబాద్‌

ఈ–చలాన్లు తప్పించు కోవాలనే ఉద్దేశంతో..
ఈ– చలాన్లు తప్పించుకోవడానికే నంబర్‌ ప్లేట్లు మూసేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్‌ కెమెరాలతో, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అధికారులు జంక్షన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు నంబరు ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు.

వీటి ఆధారంగా ఆయా ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో ఉల్లంఘనులు వినియోగించిన వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్, దాని ఆధారంగా సేకరించే రిజిస్టర్డ్‌ చిరునామానే కీలకం.  కొందరు తమ వాహనాలకు సంబంధించిన నంబర్‌ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్‌ చేస్తూ ట్రాఫిక్‌ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబరు ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు  ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ముందు వాటి కంటే వెనుకవే ఎక్కువ
వాహనాల నంబర్‌ ప్లేట్స్‌ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్‌ చేయడం అనేది కార్లు వంటి తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్లపై ఈ తరహా నంబర్‌ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్‌ మాదిరిగా ఫోర్‌ వీలర్స్‌ వాహనాలు తప్పించుకొని వెళ్లిపోలేవు. దీంతో వారు అలాంటి చర్యల జోలికివెళ్లరు.  ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్‌ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో స్పెషల్‌ డ్రైవ్స్‌ చేసేప్పుడు రహదారులపై కొన్ని వాహనాలను తనిఖీ చేస్తారు. ముందు ఉండే నంబర్‌ ప్లేట్‌ వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ వాహనాలను ఆపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వెనుక నంబర్‌ ప్లేట్‌ అయితే వాహనం ముందుకు వెళ్లిపోయాకే ట్రాఫిక్‌ పోలీసులకు కనిపిస్తుంది.

 ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. గత నెల వరకు ఐపీసీలోని సెక్షన్‌ 420 ప్రకారం నమోదు చేయగా, ఈ నెల నుంచి బీఎన్‌ఎస్‌లోని సెక్షన్‌ 318 వినియోగించనున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణ అయితే ఏడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.

ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైనే కేసులు
అనివార్య కారణాల వల్ల, పొరపాటుగా వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్లు డ్యామేజ్‌ అవుతుంటాయి. మరికొందరికి తమ నంబర్‌ ప్లేట్‌ డ్యామేజ్‌ అయిన విషయం తెలిసినా పని ఒత్తిడి, నిర్లక్ష్యం వంటి కారణాలతో దాన్ని సరి చేసుకోరు. స్పెషల్‌ డ్రైవ్‌లో ఇలాంటి వాహనాలు చిక్కితే వారికి చలాన్‌ ద్వారా జరిమానా మాత్రమే విధిస్తున్నారు. 

కొందరు మాత్రం నేరాలు చేయాలని, ఈ–చలాన్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నంబర్‌ ప్లేట్లను డ్యామేజ్‌ చేయడం, వాటిపై ఉన్న నంబర్లు మార్చడం, వంచేయడం, స్టిక్కర్లు వేసి మూసేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై మాత్రమే శాంతిభద్రతల విభాగం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నాం. – పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)