Breaking News

విచారణ పేరుతో థర్డ్‌ డిగ్రీ?

Published on Sun, 04/13/2025 - 06:34

కారేపల్లి: హత్య కేసులో విచారణ పేరుతో పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని..దీంతో వృద్ధుడైన ఓ గిరిజనుడి కాలు విరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రూప్లాతండాకు చెందిన బధిరుడైన భూక్యా హరిదాస్‌ గత ఏడాది డిసెంబర్‌ 6న గ్రామంలోని జీపీ బోరు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో బావ్‌సింగ్‌తోపాటు విశ్రాంత సింగరేణి ఉద్యోగి శంకర్, హరిదాస్‌ కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శంకర్‌ ఆచూకీ పోలీసులకు లభించలేదు.

ఐదు నెలల తర్వాత శుక్రవారం శంకర్‌ను అదుపులోకి తీసుకొని కామేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా శంకర్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతో ఆయన కాలు విరిగిందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆరోపించారు. అయితే వాహనంపై నుంచి కిందపడటంతో శంకర్‌ కాలు విరిగిందని బుకాయిస్తూ, బాధిత కుటుంబం మీడియా ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

శంకర్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మంకు, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కారేపల్లి ఎస్సై రాజారామ్‌ను వివరణ కోరగా.. శంకర్‌ కొద్దినెలలుగా పరారీలో ఉన్నాడని,  శనివారం కనిపించడంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ క్రమంలో బైక్‌పై వేగంగా వెళుతూ కింద పడ్డాడని చెప్పారు. గాయపడిన శంకర్‌ను తమ వాహనంలోనే ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించామని పేర్కొన్నారు. థర్డ్‌డిగ్రీ ప్రయోగించినట్టు చెబుతున్న విషయంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)