Breaking News

ప్రమాదం కాదు.. పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు

Published on Sun, 06/21/2026 - 04:09

మిర్యాలగూడ అర్బన్‌: చిన్నతనంలోనే వివాహం.. అంతలోనే ఇద్దరు పిల్లలు. తాగుడుకు బానిసైన భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. తోడుంటాడని నమ్మి రెండో పెళ్లి చేసుకుంటే.. అతనే కన్నపిల్లలను, ఆమె తల్లిని పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసిన ఉదంతం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది. మిర్యాలగూడ పట్టణంలోని కలల్‌వాడ కాలనీలో ఈనెల 5న రాత్రి సుమారు 2 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో వనం చంద్రమ్మ అలియాస్‌ చంద్రకళ (50), ఆమె మనువడు నక్కా లక్ష్మణ్‌ (16), మనవరాలు నక్కా ప్రణతి (14) సజీవ దహనమైన సంగతి తెలిసిందే. 

ఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌ సేకరించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు జరిపిన లోతైన విచారణలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని, పక్కా ప్లాన్‌తో పెట్రోల్‌ పోసి తగలబెట్టి ప్రమాదంగా చిత్రీకరించారని తేల్చారు. చంద్రకళ కుమార్తె ధనమ్మ మొదటి భర్త తాగుడుకు బానిసై అనారోగ్యంతో మృతిచెందాడు. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న ధనమ్మకు వివాహ వేదిక యాప్‌ ద్వారా కారు డ్రైవర్‌ అయిన కాళహస్తి శిరీశ్‌ కుమార్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరూ 2023లో నరసరావుపేటలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. 

కలల్‌వాడలో ఇల్లు నిర్మించుకునే క్రమంలో వీరి మధ్య ఆర్థిక పరమైన గొడవలు రావడంతో శిరీశ్‌ కుమార్‌ను ధనమ్మ దూరం పెట్టింది. మరోవైపు శిరీశ్‌ కుమార్‌ వివాహ వేదిక యాప్‌ ద్వారానే మరో మహిళను నమ్మించి, బంగారం లాక్కుని మోసం చేయడంతో మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదై మే నెలలో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. జైలు నుంచి విడుదలయ్యాక ధనమ్మపై కోపం పెంచుకున్నాడు. ధనమ్మ తండ్రి చనిపోవడంతో పిల్లలను తల్లి చంద్రమ్మ వద్ద ఉంచి, బతుకుదెరువు కోసం ఇటీవల పుణేలో కేర్‌టేకర్‌గా పనికి వెళ్లింది. 

ఇంట్లో ధనమ్మ లేని సమయం చూసి, ఈనెల 5న అర్థరాత్రి శిరీశ్‌ కుమార్‌ ఓ క్యాన్‌లో పెట్రోల్‌ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. గాఢనిద్రలో ఉన్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఈ క్రమంలో నిందితుడి చేతికి కూడా మంటలు అంటుకుని కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. ధనమ్మ ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడు కాళహ స్తి శిరీశ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)