Breaking News

పబ్‌లో 16 మంది ముంబై అమ్మాయిలు.!

Published on Wed, 04/16/2025 - 09:08

హైదరాబాద్‌: వ్యాపారాన్ని పెంచుకునేందుకు కస్టమర్లకు యువతులను ఎరవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ పబ్‌పై చైతన్యపురి పోలీసులు దాడి చేశారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కొత్తపేట కిలా మైసమ్మ దేవాలయ సమీపంలోని వైల్డ్‌ హార్ట్‌ పబ్‌లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోమవారం రాత్రి  దాడి చేశారు. ఈ సందర్భంగా డీజే సౌండ్‌లో యువతులతో అర్దనగ్న నృత్యాలు చేయిస్తుండటమేగాక, నిబంధనలకు విరుద్ధంగా అధిక సమయం పబ్‌ తెరిచి ఉంచుతున్నట్లు గుర్తించారు. 16 మంది యువతులను డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఒంటరి యువకులే టార్గెట్‌.. 
పబ్‌కు వెళ్లాంటే కస్టమర్ల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారు. జంటలుగా వచ్చిన వారిని కాకుండా మద్యం సేవించేందుకు ఒంటరిగా వచి్చన యువకుల వద్దకు యువతులు వచ్చి వారికి కంపెనీ ఇస్తారు. అసభ్యంగా  డాన్సులు చేస్తూ తాము సేవించే మద్యం, ఆహారం కూడా  సదరు యువకుల బిల్‌లోనే వేస్తారు. వ్యాపారం పెంచుకునేందుకు మోసపూరితంగా పబ్‌ నిర్వాహకులే యువతులకు ఫ్రీ పాస్‌ ఇచ్చి లోపలికి పంపిస్తారు. 

తద్వారా బిల్లు ఎక్కువ అయ్యేలా చేసి వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఇందుకు గాను ముంబై నుంచే కాక నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యవతులను పబ్‌ నిర్వాహకలు ఎంగేజ్‌ చేసుకుంటున్నట్లు తెలిపారు. బ్యూటీషియన్స్, జూనియర్‌ ఆర్టిస్టులను ఎంచుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. పట్టుపడిన యువతులను వనస్థలిపురం, సికింద్రాబాద్, ఉప్పల్‌ తదితర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించామన్నారు.  16 మంది యువతులతో పాటు డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పబ్‌ యజమాని రాము, మేనేజర్‌ సంతోష్‌ పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు.   

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌