Breaking News

ఇన్‌స్టాలో పరిచయం.. ఫామ్‌హౌస్‌లో మైనర్ల ట్రాప్‌ హౌస్‌ పార్టీ

Published on Mon, 10/06/2025 - 09:36

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఆదివారం మైనర్ల డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. అందరూ మైనర్లే.. ఇన్‌స్టాలో పరిచయమైన వీరంతా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో డ్రగ్స్‌ ఉన్నట్టు సమాచారంతో రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీ చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

నగరానికి చెందిన ఒక డీజే ఇన్‌స్టా యాప్‌లో మొయినాబాద్‌లోని చెర్రీ ఫామ్‌హౌస్‌లో ట్రాప్‌ హౌస్‌ పార్టీ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఇది మామూలు పార్టీ కాదని.. ఇక్కడకు వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ ఊరించాడు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే పార్టీలో పాల్గొనేందుకు పాస్‌లు తీసుకోవాలని షరతు విధించాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800 ధర నిర్ణయించాడు. 

ఇన్‌స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి సిద్ధమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది శనివారం మొయినాబాద్‌లోని ఓక్స్‌ ఫామ్‌హౌస్‌కు చేరారు. మత్తులో జోగుతున్న సమయంలో రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న వారికి నిర్వహించిన డ్రగ్‌ పరీక్షలో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. ఆరుగురు నిర్వాహకులను, 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మొయినాబాద్‌ ఠాణాలో అప్పగించారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)