నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
Kukatpally: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
Published on Wed, 02/15/2023 - 09:55
సాక్షి, హైదరాబాద్: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్‌పల్లి ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట నరసింహారాజు (31) సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉటున్నాడు. కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని లావిష్ బ్యూటీ పార్లర్, వెల్‌నెస్ స్పా నిర్వహిస్తున్నాడు.
స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి వాట్సప్‌లో యువతుల ఫొటోలు పంపుతూ విటులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ, కూకట్‌పల్లి పోలీసులు ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags : 1