Breaking News

అసైన్డ్‌ భూమిని ఎలా కొట్టేయాలనుకున్నారు?

Published on Fri, 04/12/2024 - 04:45

సాక్షి, హైదరాబాద్‌: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల అసైన్డ్‌ భూమిని కాజేసిన వ్యవహారంలో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్‌ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి బుధవారం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసుల ఎదుట హాజరయ్యారు. అధికారులు శివానందరెడ్డిని దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయన నుంచి కొంత సమాచారం సేకరించిన పోలీసులు వచ్చే వారం మరోసారి సీసీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్‌్క, ప్రశాంత్‌రెడ్డినీ సీసీఎస్‌ పోలీసులు గత వారం ప్రశ్నించిన విషయం విదితమే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని తొలుత ప్రయత్నించిన రియల్టర్లు టీజే ప్రకా‹Ù, గాం«దీ, రామారావు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ దయానంద్‌ 2021లో మిమ్మల్ని ఎందుకు సంప్రదించారంటూ పోలీసులు శివానందరెడ్డిని ప్రశ్నించారు.

బుద్వేల్‌లోని ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలు తెలిసినప్పటికీ పోలీసు అధికారిగా ఉన్న పరిచయాలు, పలుకుబడి వినియోగించి అసైన్డ్‌ ల్యాండ్‌ను కాజేయాలని ప్రయత్నించడంపై శివానందరెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ భూములు సొంతం చేసుకునే ఉద్దేశంతో 2021–22 మధ్య కాలంలో అసైనీలకు శివానందరెడ్డి తన సంస్థ ద్వారా చెక్కుల రూపంలో చెల్లించిన మొత్తం వివరాలను సీసీఎస్‌ పోలీసులు అడిగారు. 

ఇంకా మీ వెనుక ఎవరున్నారు?
ఆ అసైన్డ్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం 2022–23 మధ్య  ఎవరెవరి ద్వారా? ఎక్కడెక్కడ లాబీయింగ్‌ చేశారు? ఈ వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు? అనే వివరాలను శివానందరెడ్డి నుంచి రాబట్టడానికి సీసీఎస్‌ పోలీసులు ప్రయత్నించారు. అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్‌ డీడ్స్‌ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్‌ ఎమ్మార్వోకు మె మో జారీ అవడం వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశా న్నీ పోలీసులు ప్రశ్నించారు.

గత ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్‌ డీడ్స్‌ జరగ్గా.. ఆ భూమిని ఏ అండ్‌ యూ ఇన్‌ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్‌ కంపెనీస్‌లకు వారిపై రిజిస్టర్‌ చే యడం పైనా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు.

అసైనీలను భయపెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్‌ భూములు లాక్కోవడానికి కుట్ర ప న్న డం ఉద్దేశపూర్వకంగా చేసిందా? అనే అంశాన్నీ పోలీ సు లు పరిగణనలోకి తీసుకుని శివానందరెడ్డిని ప్రశ్నించా రు. ఆయన నుంచి సేకరించిన సమాచారాన్ని సరిచూడాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం మరోసారి రావాలని స్పష్టం చేశారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)