Breaking News

సైబరాబాద్‌ అధికారి‘అదనపు’ విధులు!

Published on Fri, 01/24/2025 - 09:44

సాక్షి, సిటీబ్యూరో: పోలీసులు.. సాధారణంగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్నీ నిర్లక్ష్యం చేస్తారనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. న్యాయస్థానాలతో పాటు ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపైనే పలువురిపై చర్యలు తీసుకుంటూ ఉంటాయి. కొందరు ఖాకీలకు ఇదంతా డ్యూటీల దగ్గర మాత్రమే... ‘వాటా’ల వద్దకు వచ్చేసరికి మాత్రం తమవి కాని విధుల్నీ నిర్వర్తించేస్తుంటారు. భూ కబ్జాదారులతో కుమ్మక్కై ఇతర శాఖల అధికారులతో కలిసి ‘ప్లాన్‌’ చేస్తూ భూ యజమానుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఓ వ్యవహారమే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతోంది. హైటెక్‌ జోన్‌ కేంద్రంగా ఓ ఉన్నతాధికారి నిర్వర్తిస్తున్న ‘అదనపు’ విధులకు బల్దియా అధికారి సైతం సహకరిస్తుండటం గమనార్హం.  

భూ విలువలు పెరగడంతో కుట్రలు.. 
నగర వ్యాప్తంగా భూములు విలువలు గణనీయంగా పెరిగిపోవడం కొత్త వివాదాలకు కారణం అవుతోంది. ఖాళీ జాగాలకు కొత్త యజమానులు పుట్టుకువస్తున్నారు. మదీనాగూడ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం కూడా అలాంటిదే. నగరానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతంలోని రెండు సర్వే నంబర్లలో ఉన్న స్థలం ఖరీదు చేశారు. మొత్తం వెయ్యి చదరపు గజాలకు పైగా ఉన్న ఈ స్థలంలో చాలా భాగం విక్రయించారు. మిగిలిన 300 గజాల్లో నిర్మాణం చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిపై కన్నేసిన పాత యజమాని సంబం«దీకులు కొందరు వివాదం చేయడం మొదలెట్టారు. రేటు ఆకాశాన్ని అంటడంతో ఏమాత్రం అవకాశం చిక్కినా చట్టపరంగా ఆ భూమిని తిరిగి సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు.  

కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. 
ఈ స్థలంపై యాజమాన్యం హక్కు కోసం, ఆపై టెనెంట్‌ కేసుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానికోసం కొన్ని నోటరీ పత్రాలను సమరి్పంచారు. ఖాళీ స్థలాలకు కేవలం ప్లాట్‌ నంబర్లు మాత్రమే ఉంటాయి. వివాదం చేయాలని భావించిన వాళ్లు ఏకంగా డోర్‌ నంబర్‌ వేసుకుని మరీ పత్రాలు రూపొందించారు. దీంతో న్యాయస్థానం వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ భూమి ఎవరి పేరుతో ఉందో ఆ మహిళకే కోర్టు పర్మనెంట్‌ ఇంజెక్షన్‌ ఆర్డర్‌ సైతం ఇచి్చంది. దీని ఆధారంగా జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్న భూ యజమాని నిర్మాణం కోసం అనుమతి కూడా తెచ్చుకున్నారు.  ఈమెను ఇబ్బంది పెట్టడం ద్వారా లబి్ధ పొందాలని ప్రయతి్నంచిన కబ్జారాయుళ్లు దీనికోసం కొత్త పథకం వేశారు. 

ఒత్తిడికి యత్నించి.. 
సైబరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలోని ఓ కీలక జోన్‌లో పని చేస్తున్న ఉన్నతాధికారిని సంప్రదించాడు. ఇద్దరి మధ్యా జరిగిన ‘ఒప్పందం’తో రంగంలోకి దిగిన అధికారి తొలుత పోలీసులను వాడి భూ యజమానికిపై ఒత్తిడికి ప్రయతి్నంచారు. ఇది ఫలితం ఇవ్వకపోవడంతో కథ మార్చారు. బల్దియాకు చెందని మరో ఉన్నతాధికారితో కలిసి ‘ప్లాన్‌’ చేశాడు. వీలైనంత త్వరగా ఆ పోలీసు, బల్దియా అధికారులకు కలిసి సెటిల్‌ చేసుకుంటే ఉత్తమం అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో విసిగిపోయిన ఆ యజమాని న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)