Breaking News

సన్నీలియోన్‌ షోకు పోలీసుల అనుమతి నిరాకరణ

Published on Sun, 12/01/2024 - 11:45

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌.10లోని ఇల్లీయూజన్‌ పబ్‌లో శనివారం వీకెండ్‌ నైట్‌లైఫ్‌లో భాగంగా ప్రముఖ బాలివుడ్‌ నటీ సన్నీ లియోన్‌ లైవ్‌ ఫెర్ఫార్మెన్స్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ఆమె ఈ పబ్‌లో ఒప్పందం ప్రకారం డీజే ప్లే చేస్తూ కుర్రకారుకు హుషారు తెప్పించాలి. ఇందుకోసం నిర్వాహకులు జూబ్లీహిల్స్‌ పోలీసుల అనుమతి కోరగా, ఇందుకు నిరాకరించారు.

 ఉదయం నుంచే సన్నీ లియోన్‌ రాకకోసం కుర్రకారు ఎదురు చూస్తుండగా, అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఫైల్‌ పక్కన పెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సన్నీ లియోన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించాలని నిర్ణయించుకున్న నిర్వాహకులు ఉన్నతాధికారులను కూడా కలిశారు. ఎలాగైనా ఆమెను పబ్‌కు తీసుకు రావాలని ప్రయత్నించారు. మరోవైపు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌లోకి రానివ్వొద్దంటూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పబ్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టికెట్లు కొనుగోలు చేసిన యువతీ యువకులు రాత్రి 8 గంటల నుంచే పబ్‌కు చేరుకోవడం ప్రారంభించారు. 

ఒక వైపు పోలీసుల మోహరింపు..మరో వైపు అనుమతుల నిరాకరణ...ఇంకో వైపు హోటల్లో సన్నిలియోన్‌ ఎదురు చూపుల మధ్య హైడ్రామా రక్తి కట్టింది. ఈ క్రమంలో చివరకు నిర్వాహకులు సన్నీలియోన్‌ ఆరోగ్యం బాగాలేనందున ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ అయినట్లు ఓ వీడియోను విడుదల చేశారు. రూ.లక్షలు పోసి టికెట్లు కొన్న యువతీ యువకులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అడ్డదారిలోనైనా ఆమెను తీసుకొస్తారేమోనని అనుమానించి పబ్‌ చుట్టూ 100 మంది పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ఇక ఆమె రాదని నిర్ధారించుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.    

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)