Breaking News

మౌనిక, పాపపై దాడి జరిగినట్టు ఆధారాలు లేవు

Published on Fri, 02/27/2026 - 02:08

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టామని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న కుమ్మెర జాతరలో దాడి జరిగిన సమయంలో డయల్‌ 100కు సమాచారం వచ్చిన వెంటనే స్పందించామన్నారు. ముందుగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి తలకు గాయమైందని గణేశ్‌పై ఫిర్యాదు ఇచ్చారని, దీంతో కేసు నమోదు చేశామన్నారు. అలాగే గణేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై మరో కేసు పెట్టామని చెప్పారు. 

అయితే ఘటన రోజు ఇచ్చిన ఫిర్యాదులో గణేశ్, చంద్రకళపై మాత్రమే దాడి గురించి ప్రస్తావించారని, మౌనిక, పాపపై దాడి జరిగినట్టుగా ఫిర్యాదులో లేదన్నారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఈ నెల 21న ఉదయం పాప మరణించిందని చెప్పారు. జనరల్‌ ఆస్పత్రిలో పాపకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారని పేర్కొన్నారు. ఈ నెల 17న జాతరలో తల్లి చంద్రకళను శ్రీనివాస్‌రెడ్డి తిట్టాడని.. శ్రీనివాస్‌రెడ్డిని దూషిస్తూ గ్రామ వాట్సప్‌ గ్రూప్‌లో గణేశ్‌ ఆడియో పోస్టు చేశాడు. గ్రూప్‌లో ఎందుకు పోస్టు చేశావంటూ గణేశ్‌ను ప్రశ్నిస్తూ శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో 8 మంది గణేశ్, చంద్రకళపై దాడికి దిగినట్టు వివరించారు.

8మందిపైకేసు... ముగ్గురు రిమాండ్‌
నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆస్పత్రిలో గత డిసెంబర్‌ 21న 1.44 కిలోల బరువుతో పాప జన్మించినట్టు ఎస్పీ చెప్పారు. శ్వాస సంబంధ సమస్యతో ఎన్‌ఐసీయూలో చికిత్స పొందిందన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రిలో 30 రోజులపాటు చికిత్స పొందినట్టు చెప్పారు. రెస్పిరేటరీ, జాండీస్, న్యూమోనియా సమస్యలున్నట్టు గుర్తించామన్నారు. అయితే పాప మరణానికి సంబంధించి ఫోరెన్సిక్, విస్త్రా రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. కుమ్మెర జాతరలో మౌనికతోపాటు ఆమె బిడ్డపై దాడి జరిగినట్టు ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని, ఇప్పటికే దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని రిమాండ్‌కు పంపామని వివరించారు. మిగతా వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.

బాధితుల ఆచూకీ లేదు: నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌
కుమ్మెర ఘటనలో దాడికి గురైన బాధిత కుటుంబం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో ఆరు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి బాధిత కుటుంబ సభ్యులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేశారు. ఆ తర్వాత అక్కడి టెంట్లు, వేదికను సైతం తొలగించారు. దీనిపై నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ స్పందిస్తూ బాధిత కుటుంబం తమకు సమాచారం ఇవ్వకుండా కారులో వెళ్లిపోయారని చెప్పారు. బీసీ జేఏసీ, డీఎస్పీ నాయకులు సాయి, రఘు వారిని కారులో తీసుకువెళ్లారని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించేందుకు బాధిత కుటుంబం వెళ్లినట్లు సమాచారం.

నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
కుమ్మెర జాతరలో దాడి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ను ఆదేశించింది. ఈ ఘటనపై న్యాయవాది వినోద్‌ హిందుస్థానీ ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేయగా కమిషన్‌ స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి యాక్షన్‌ టోకెన్‌ రిపోర్టును తమకు నాలుగు వారాల్లో అందించాలని కలెక్టర్, ఎస్పీలకు నోటీసు జారీ చేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)