Breaking News

పాశమైలారం ప్రమాదం.. ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు

Published on Wed, 07/02/2025 - 12:26

సాక్షి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలను వెల్లడించారు. మిషనరీ పాతది కావడం, కనీస ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపింది.

సిగాచి కంపెనీ ఉద్యోగి యశ్వంత్‌ ఇచ్చిన ఫిర్యాదుపై భానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. సిగాచి కంపెనీలో పాత బడిన మిషనరీ ఉంది. దీనిపై కంపెనీ ఉద్యోగులు ఇప్పటికే చాలా సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా అదే పాత బడిన మిషనరీ వాడటంతో ప్రమాదం జరిగింది. ఉద్యోగుల మరణాలకు కంపెనీయే కారణం.

సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో కంపెనీలో 145 మంది పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి కొంత మంది అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది మంటల్లో కాలిపోతూ కనిపించారు. సిగాచి కంపెనీలో కనీస సదుపాయాలు లేవు. మంటలను ఆర్పేందుకు కనీసం ఫైర్‌ సిలిండర్స్‌ కూడా లేవు. ఇక, సిగాచి కంపెనీలో కనీస ప్రమాణాలు పట్టించుకోలేదని అధికారులు గుర్తించారు.

ఇదిలా ఉండగా.. పాశమైలారంలోని పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం పరిశీలించారు. మంత్రితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, సీనియర్‌ నేత జగ్గారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది మరణించారని.. ఇంకా 11 మంది కార్మికుల ఆచూకీ దొరకడం లేదని తెలిపారు. ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు. 18 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. బాధితుల బంధువులను పరామర్శించి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)