Breaking News

అడ్వాన్స్‌గా రూ.30వేలు.. నా భర్త చంపేయండి గోపి..!

Published on Fri, 03/14/2025 - 11:49

హన్మకొండ:  భర్తను కడతేర్చడానికి భార్య సుపారీ(Supari) అందజేసింది. ఎలాగైనా, ఎవరికీ అనుమానం రాకుండా చంపాలని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో గురువారం భార్యతోపాటు నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సంపేట రూరల్‌ ఎస్సై అరుణ్‌ కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధారావత్‌ సుమన్‌కు, మహేశ్వరం గ్రామానికి చెందిన మంజులతో 2018 సంవత్సరంలో వివాహం జరిగింది.

ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. మూడు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతుండడంతో హైదరాబాద్‌లో వేర్వేరుగా ఉంటున్నారు. సుమన్‌ హైదరాబాద్‌లోనే(Hyderabad) ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం నరేశ్‌ అనే యువకుడు సుమన్‌కు వాట్సాప్‌ కాల్‌(WhatsApp call) చేసి నిన్ను చంపేందుకు ప్రయత్నం జరుగుతుందని, తనకు డబ్బులు ఇస్తే ఆ ప్రయత్నాన్ని ఆపుతానంటూ చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన సుమన్‌.. ఈనెల 9వ తేదీన నరేశ్‌పై నర్సంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో సుమన్‌ భార్య మంజుల..(Manjula) మరికొందరితో కలిసి భర్తను చంపించేందుకు నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపికి రూ.30వేల సుపారీ ఇచ్చినట్లు నరేశ్‌ తెలిపాడు. దీంతో మంజుల, ఆమెకు సహకరించిన ఆమె బావ ములుగుకు చెందిన మోతీలాల్, వరంగల్‌ జిల్లా రాయపర్తికి చెందిన నరేశ్, నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపి, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన మల్లేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. 

ప్రియురాలితో పెళ్లి కోసం..


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)