Breaking News

Police Constable suicide: ఇద్దరు పోలీసుల ఆత్మహత్య

Published on Mon, 10/14/2024 - 08:14

బూర్గంపాడు/ఏన్కూరు/మహబూబాబాద్‌ రూరల్‌: ఓ కేసులో ఉన్నతాధికారులు తనను బలి పశువును చేశారన్న ఆవేదనతో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాలతో మరో కాని స్టేబుల్‌ తుపాకీతో కాల్చుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్‌ (34) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో, ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పని చేసినప్పుడు గంజాయి అక్రమ రవాణా కేసులో సాగర్‌ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులు ఆయనను అరెస్ట్‌ చేసి,  సస్పెండ్‌ చేశారు. 

ఇటీవలే సస్పెన్షన్‌ ఎత్తివేసి ఏడూళ్ల బయ్యారంలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన తప్పు లేకున్నా ఎస్సైలు సంతోష్, రాజ్‌కుమా ర్, బీఆర్‌ఎస్‌ నాయకుడు నాని తనను గంజాయి కేసులో ఇరికించారని.. ఆ నింద మోయలేకపోతున్నా.. చచి్చపోతున్నా అంటూ సాగర్‌ ఏన్కూరులోని ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాల్వ వద్ద పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసి శనివారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయిని బయట విక్రయించేందుకు ఎస్సైలు త నపై ఒత్తిడి చేశారని, తన సెల్‌ నుంచే గంజాయి కొనుగోలుదారులకు ఫోన్లు చేయించారని తెలిపాడు. ఇది బయటపడుతుందన్న భయంతోనే తనను అరెస్ట్‌ చేయించారని ఆరోపించాడు. 

కాగా, పురుగు మందు తాగిన సాగర్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సా యంత్రం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా ‘రేవంతన్నా.. నా కుటుంబానికి న్యాయం చేయండి’అని మరో సెల్ఫీ వీడియో తీశాడు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలు, ఒక సీఐ, బీఆర్‌ఎస్‌ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు ఎస్సై రఫీ తెలిపారు. 

కుటుంబ విభేదాలతో.. 
మరో ఘటనలో తుపాకీతో కాల్చుకుని ఓ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం ఎన్‌జీఓస్‌ కాలనీకి చెందిన గుడిబోయిన శ్రీనివాస్‌ (59)కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే, విబేధాల కారణంగా ఐదేళ్ల నుంచి వారికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్‌ ఐడీఓసీ ఆవరణలోని స్ట్రాంగ్‌రూం వద్ద ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో తన ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. 

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం 
నల్లబెల్లి: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ధరణికి 2020లో కానిస్టేబుల్‌ ఉద్యోగం రాగా, వరంగల్‌ జిల్లా నల్లబెల్లి లోని పోలీస్‌ క్వార్టర్స్‌లో నివనిస్తోంది. నాలుగు నెలల క్రితం తన పెద్దన్నకు వివాహం అయింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తన పెళ్లి విషయమై తరచుగా ఆలోచిస్తూ మనస్తాపానికి గురైన ధరణి.. పోలీస్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఆదివారం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన పోలీసులు మంటలార్పి.. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)