Breaking News

‘నంబాల’ అస్థికలకు న్యాయపోరాటం

Published on Fri, 05/30/2025 - 01:45

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్‌ నంబాల కేశవరావు అస్థికల కోసం కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల చనిపోగా.. ఆయన మృతదేహానికి పోలీసులే 26వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనతో పాటు మరికొందరి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే అస్థికలను కుటుంబసభ్యులకు అప్పగించే విషయంలో.. మరోసారి వివాదం చెలరేగినట్టు బస్తర్, జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఆదివాసీ శ్మశానవాటికలో.. 
ఈనెల 21న నంబాలతో పాటు 28మంది మావోయిస్టులు చనిపోగా అందులో 27మంది మృతదేహాలకు నారాయణపూర్‌ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి మృతదేహాలు ఉన్నాయి. వీరి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్రీజర్లతో కూడిన మూడు అంబులెన్సులు 22వ తేదీ సాయంత్రం నాటికి నారాయణపూర్‌ చేరుకున్నాయి. 

కాగా, మృతులతో తమకున్న రక్త సంబంధం నిరూపించుకునేందుకు చట్టపరమైన ఆధారాలు (ఆధార్‌ కార్డ్, ఫ్యామిలీ ఫొటో, సర్పంచ్‌ ధ్రువీకరణ పత్రం) సమర్పించలేదనే కారణంతో.. 26వ తేదీన సాయంత్రం పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణపూర్‌లోని ఆదివాసీ శ్మశానవాటికలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మావోయిస్టులతో పాటు మరో ముగ్గురు ఛత్తీస్‌గఢ్‌ నక్సల్స్‌ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. 

డిక్లరేషన్‌ పేచీ.. 
అంత్యక్రియలు జరిగిన మర్నాడు.. నంబాల కేశవరావు సోదరుడు నంబాల రామ్‌ప్రసాద్‌ ఛత్తీస్‌గఢ్‌ పోలీసులను ఆశ్రయించి తన సోదరుడి అస్థికలు ఇవ్వాలని కోరారు. కాగా, తమ కుటుంబ సభ్యుడేనని నిరూపించుకునేందుకు అవసరమైన చట్టపరమైన పనులు నిర్వర్తించడంలో విఫలమైనట్లు డిక్లరేషన్‌ పత్రంపై సంతకం చేయాలని అక్కడి పోలీసులు సూచించినట్లు సమాచారం. దీనికి నిరాకరించిన నంబాల సోదరుడు మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  

చివరి చూపైనా దక్కలేదు 
ఎనిమిది మంది మృతదేహాలకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. అందులో మావోయిస్టు హుంగీ కుటుంబ సభ్యులు.. తమ ఆర్థిక సమస్యల రీత్యా.. పోలీసులే నిర్వహించాలని కోరారు. కానీ అంత్యక్రియలకు ముందు ఒక్కసారైనా హుంగీ మృతదేహాన్ని తమకు చూపలేదని వారు వాపోయారు. ఏళ్ల తరబడి ఇంటికి దూరమై విగత జీవులుగా మారిన తమ వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించాలనే లక్ష్యంతో ఫ్రీజర్‌ బాక్స్‌లున్న అంబులెన్సులు తెచ్చుకున్నామని, కానీ ఉత్త చేతులతో తిరుగు ముఖం పట్టాల్సి వచ్చిందని తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈనెల 21న ఎన్‌కౌంటర్‌ జరిగితే.. 26వ తేదీ వరకు మృతదేహాలన్నీ ఆరుబయటే ఉన్నాయని, మార్చురీ నుంచి వచ్చే దుర్గంధంతో ఆస్పత్రి ప్రాంగణం, సమీపంలోని టీ కొట్లు, ఇతర దుకాణాలను మూసేశారని వెల్లడించారు. ఇంత జరిగినా తమ వారి చివరి చూపు కోసం పరితపిస్తే ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు సహకరించలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల విషయంలో కేవలం ఆధార్‌కార్డు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాలు ఇచ్చారని.. తెలుగు రాష్ట్రాల మావోయిస్టుల విషయంలోనే పేచీ పెట్టారని వారు వాపోతున్నారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు