Breaking News

టాలీవుడ్‌ నిర్మాత శివరామకృష్ణ బెయిల్‌ రద్దు

Published on Fri, 10/25/2024 - 06:33

సాక్షి,  హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివార్లలోని రెండు ప్రాంత్లాలో ఉన్న ఖరీదైన భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కబ్జా చేసే ప్రయత్నం చేసిన టాలీవుడ్‌ నిర్మాత, రియల్డర్‌ బూరుగుపల్లి శివరామకృష్ణ కేసులో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అరెస్టు అయిన మరుసటి రోజే బెయిల్‌పై బయటకు వచ్చిన ఈయన గురువారం మళ్లీ కటకటాల్లోకి వెళ్లారు. బెయిల్‌ రద్దు చేయడంతో పట్టుకున్న ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శివరామకృష్ణతో పాటు బెయిల్‌ పొందిన మరో నిందితుడు లింగమయ్య ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. శివరామకృష్ణ శ్రీవెంకటేశ్వర ఎస్టేట్స్‌ సంస్థకు మేనేజింగ్‌ పార్టనర్‌గా ఉన్నారు. 

రాయదుర్గం పైగా విలేజ్‌లోని సర్వే నం.46లో ఉన్న 83 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు యాచారంలోని మరో 10 ఎకరాల ప్రైవేట్‌ భూమిపై కన్నేశారు. వీటిపై నకిలీ పత్రాలు సృష్టించిన శివరామకృష్ణ తార్నాకలో ఉన్న స్టేట్‌ ఆరై్కవ్స్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న కె.చంద్రశేఖర్‌ను సంప్రదించారు. అతడి సహాయంతో వీటికి మద్దతుగా స్టేట్‌ ఆరై్కవ్స్‌ నుంచి ఓ నకిలీ పహాణీ, సేత్వార్‌ రూపొందించి, అటెస్టేషన్‌ చేయించి తీసుకున్నారు. వీటి ఆధారంగా సైదాబాద్‌కు చెందిన రియల్టర్‌ ఎం.లింగమయ్యతో కలిసి రంగంలోకి దిగిన శివరామకృష్ణ రాయదుర్గంలోని భూమి తనదే అంటూ అందులో పాగా వేశారు. యాచారంలో ఉన్న ప్రైవేట్‌ భూమి మీద వివాదం సృష్టించారు. 

శివరాకృష్ణ సమరి్పంచినవి నకిలీ పత్రాలని తేలి్చన న్యాయస్థానం అది ప్రభుత్వ భూమిగా ప్రకటించింది. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు ఈ నెల 17న శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగమయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అనారోగ్య కారణాలు చూపిన శివరామకృష్ణ, లింగమయ్య ఆ మరుసటి రోజే బెయిల్‌ పొందారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇరువురికీ మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేసింది. దీంతో గురువారం శివరామకృష్ణను పట్టుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు. స్టేట్‌ ఆరై్కవ్స్‌ ఉద్యోగి చంద్రశేఖర్‌ ఇప్పటికీ జైల్లోనే రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)