Breaking News

పిల్లలతోపాటు తల్లిదండ్రులూ కోర్టుకు!

Published on Sun, 05/04/2025 - 06:02

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మైనర్‌ డ్రైవింగ్‌ నిరోధంపై దృష్టి పెట్టిన ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఈ ఉల్లంఘనకు పాల్పడిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులు (వాహన యజమానులైతే)/వాహన యజమానిపై చర్యలు తీసుకుంటున్నారు. మైనర్లను జువెనైల్‌ బోర్డు ఎదుట హాజరుపరుస్తున్న ట్రాఫిక్‌ విభాగం అధికారులు, తల్లిదండ్రులు/వాహన యజమానిని సాధారణ కోర్టుకు తరలిస్తున్నారు. దీనికి ముందు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో (టీటీఐ) వీరికి పూర్తిస్థాయిలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

మైనర్‌ డ్రైవింగ్‌పై ట్రాఫిక్‌ విభాగం అధికారులు గత నెల 5 నుంచి స్పెషల్‌ డ్రైవ్స్‌ చేస్తున్నారు. శనివారం వరకు నిర్వహించిన తనిఖీల్లో 2,067 మంది మైనర్లు డ్రైవింగ్‌ చేస్తూ చిక్కారని, వీరిపై కేసులు నమోదు చేశామని జోయల్‌ డెవిస్‌ పేర్కొన్నారు. వాహనాలను స్వా«దీనం చేసుకుంటున్న పోలీసులు మైనర్‌తో పాటు తల్లిదండ్రులు/వాహన యజమానిని టీటీఐకి రప్పిస్తున్నారు. అక్కడ కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత అభియోగపత్రాలు సిద్ధం చేసి మైనర్‌ను జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ముందు, తల్లిదండ్రులు/వాహన యజమానిని సంబంధిత కోర్టులో హాజరుపరుస్తున్నారు. 

న్యాయమూర్తులు మైనర్లకు సామాజిక సేవ వంటి శిక్షలు విధిస్తుండగా... తల్లిదండ్రులు/వాహన యజమానులకు భారీ జరిమానాలు వేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వీరికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వాహనంతో పాటు ఆ మైనర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీఏ అధికారులు పంపిస్తున్నారు. వీటి ఆధారంగా ఆ విభాగం వాహనం రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తోంది. 

సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెరి్నంగ్‌ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్‌ తీసుకోవచ్చు. అయితే ఇలా డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన మైనర్‌కు మాత్రం 25 ఏళ్లు నిండేవరకు ఈ రెండింటిలో ఏదీ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని జోయల్‌ డెవిస్‌ కోరుతున్నారు.   

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)