Breaking News

గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ

Published on Fri, 08/25/2023 - 13:37

ఇటీవల మరణించిన ప్రజాకవి గద్దర్  భార్య గుమ్మడి విమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. గద్దర్‌ మృతి తెలుసుకొని తానెంతో బాధపడ్డానని తెలిపారు.  తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోదీ సానుభూతిని తెలియజేశారు.

సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గద్దర్ పాటలు, రచనలు ప్రతిబింబిస్తాయని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు. గద్దర్‌ కుటుంబ సభ్యుల దు:ఖాన్ని మాటల్లో చెప్పలేనని,  శ్రేయోభిలాషులకు, బంధువులకు దీనిని తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరకుంటున్నానని మోదీ తెలిపారు. చివరిగా లేఖలో ఓంశాంతి అని పేర్కొన్నారు.

కాగా ఈ నెల 6వ తేదీన గద్దర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. గత నెల జూలై 20వ తేదీన గుండెపోటుతో బేగంపేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరిన గద్దర్‌కు గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. అయితే గద్దర్‌కు ఊపిరితిత్తులు, యూరినరీ ఇన్‌ ఫెక్షన్‌ కారణంగా మృతి చెందినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 7వ తేదీన గద్దర్‌ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రను చూసేందుకు కూడా జనాలు భారీగా తరలివచ్చారు.
చదవండి: అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)