Breaking News

రైల్వేలో పురాతన బావుల పునరుద్ధరణపై ప్రధాని ప్రశంస

Published on Mon, 02/27/2023 - 04:18

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: సికింద్రాబాద్‌ మౌలాలీలోని జోనల్‌ రైల్వే ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (జడ్‌ఆర్‌టీఐ)లో ఉన్న 200 ఏళ్ల నాటి వారసత్వ బావిని పునరుద్ధరించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తంచేశారు. నీటి సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ కోసం దక్షిణ మధ్య రైల్వే చేసిన కృషి అభినందనీయమని ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు. ‘హరిత కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని 200 ఏళ్లనాటి వారసత్వ బావి పునరుద్ధరించారు.

నీటి సంరక్షణ సులభతరం చేయడానికి దాని చుట్టూ రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్‌లను నిర్మించారు’ అన్న రైల్వేశాఖ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. దీనివల్ల నీటివనరులను కాపాడుకునేందుకు, సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రూ.6 లక్షలతో దక్షిణ మధ్య రైల్వే ఈ బావి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టింది. దీనివల్ల రూ.5 లక్షల వరకు ఆదా అవుతుందని అంచనా.

సుమారు 50 అడుగుల లోతు ఉన్న ఈ హెరిటేజ్‌ బావి రోజుకు 1 లక్ష లీటర్ల నీటిని అందజేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ వారసత్వ మెట్ల బావి 200 ఏళ్ల నాటిది. నిజాం కాలంనాటి ఈ బావికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. సర్‌ మీర్‌ తురాబ్‌ అలీఖాన్, సాలార్‌జంగ్‌–1 (1829–1883) దీన్ని మామిడి తోటలకు కావాల్సిన నీటికోసం నిర్మించారు. నీటిపారుదల సిబ్బంది నివాసం కోసం బావికి ఉత్తరం వైపు ప్రత్యేకంగా 10 గదులను నిర్మించారు. 1966లో ఈ బావి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చింది.  

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)