Breaking News

వచ్చే నెలలో ‘పీఎం ఈ–డ్రైవ్‌’ టెండర్లు

Published on Mon, 05/26/2025 - 05:13

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నగరం నుంచి ఆర్టీసీ డీజిల్‌ బస్సులను పూర్తిగా తొలగించే ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇందుకు అవసరమైన 2,800 బస్సులను కేంద్రప్రభుత్వం పీఎం ఈ–డ్రైవ్‌ పథకంలో భాగంగా అందించనుంది. తాజాగా కేంద్రప్రభుత్వం ఇందులో 2 వేల బస్సులను మంజూరు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. మిగతావాటిని తదుపరి మంజూరు చేయనుంది. మంజూరైన బస్సులకు వచ్చే నెలలో టెండర్లు పిలవబోతోంది.  

నాలుగు ప్రాంతాల్లో అనువైన స్థలాలు  
ప్రస్తుతం సిటీలో దాదాపు 2,500 బస్సులు నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూరిన తర్వాత డీజిల్‌ బస్సులను రాష్ట్రంలోని ఇతర డిపోలకు బదలాయిస్తారు. ఉన్న బస్సులు నగర ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నందున, ఎలక్ట్రిక్‌ బస్సులను పెంచాలని, అదనంగా 300 బస్సులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బస్సుల సంఖ్య పెరిగితే ఉన్న డిపోలు సరిపోవు. చార్జింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉన్నందున సాధారణ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ బస్సులకు ఎక్కువ స్థలం అవసరం. దీంతో నగరంలో అదనంగా మరో పది డిపోలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

టెండర్ల ప్రక్రియ పూర్తయిన మూడు నెలల్లో బస్సుల రాక మొదలవుతుంది. దీంతో కొత్త డిపోల ఏర్పాటుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. శంషాబాద్, శామీర్‌పేట, తుర్కయాంజాల్, హయత్‌నగర్‌ ఇలా.. పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి ఉన్న సొంత స్థలాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో సొంత భూములను అనువుగా ఉన్నట్టు గుర్తించింది. ఒక్కో డిపోలో 60–80 వరకు బస్సులు ఉంచాలని భావిస్తోంది. ప్రస్తుతం నగరంలో 550 ఎలక్ట్రిక్‌ బస్సులు సరఫరా చేయాల్సి ఉండగా, విడతల వారీగా 275 బస్సులు వచ్చాయి. కానీ, ప్రస్తుతం చైనాతో మన దేశానికి సంబంధాలు సానుకూలంగా లేకపోవటం మిగతా బస్సుల సరఫరాపై ప్రభావం చూపుతోంది. డిసెంబర్‌ వరకు గానీ మళ్లీ సరఫరా ఉండకపోవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)