Breaking News

జనరల్‌ బోగీల వద్దే భోజనం ప్లేట్‌ మీల్స్‌ రూ.50

Published on Sat, 07/22/2023 - 03:23

 సాక్షి, హైదరాబాద్‌: జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారికోసం జనాహార్‌ కేంద్రాలు అందుబా­టులోకి వచ్చాయి. ఇప్పటి­వరకు ఈ కేంద్రాలు ప్రధాన రైల్వేస్టేషన్లలో స్టాళ్లకే పరిమితమయ్యాయి. సాధారణ బోగీల్లో ప్రయాణించేవారి భోజన ఇబ్బందులు తొలగించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనరల్‌ బోగీలు ఆగేచోటనే ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్‌ల పరిధిలోనూ ఈ సేవలు అమలవుతు­న్నాయి.

దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్‌లలో ఈ తరహా సదుపాయం ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివిడతగా దక్షిణమధ్య రైల్వేలో మొదట నాలుగుస్టేషన్లలో జనాహార్‌ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు.  జనరల్‌ బోగీ  ప్రయాణికులు మాత్రం తమకు ఆహారం కావాలంటే  ట్రైన్‌ దిగి స్టేషన్‌లో అందుబాటులో ఉన్న రె­స్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల నుంచి ఆహారం తెచ్చుకోవాలి.  ఈ ఇబ్బందులను తొలగించేందుకే జనరల్‌ బోగీల వద్దకే జనాహార్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 

తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం
అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో తయారు చేసిన శుభ్రమైన ఆహారపదార్థాలను ప్రయాణికులకు అందజేస్తారు. 

  • రూ.20కే  ఏడు పూరీలు, కర్రీ ఇస్తారు. ఇది 250 ­గ్రాముల వరకు ఉంటుంది. దీనిని ఐఆర్‌సీటీసీ ఎకానమీ మీల్‌గా పేర్కొంది. 
  • కాంబో మీల్‌ రూ.50కే అందజేస్తారు. ఇందులో 350 గ్రాముల వరకు అన్నం, ఒక కర్రీతోపాటు పప్పు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలను అందజేస్తున్నారు.  
  • ప్రయాణికులు డిజిటల్‌ రూపంలో చెల్లించే సదుపాయం ఉంది.

దశలవారీగా విస్తరణ 
దశలవారీగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ, వరంగల్, కాజీపేట్‌ తదితర స్టేషన్‌లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశ­ముం­ది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం తక్కువ ధరలోనే లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ తెలిపారు.

ప్లేట్‌ ఇడ్లీ  రూ.1,200

గోల్డ్‌ ఇడ్లీని అమ్ముతున్న హైదరాబాద్‌ కేఫ్‌

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): గోల్డెన్‌ ఇడ్లీ.. నగరంలో అందు­బాటులోకి వచ్చిన కొత్త డిష్‌ ఇది. ప్లేట్‌ ఇడ్లీ ధర రూ.1200..­అందుకే ఆ ఇడ్లీ బంగారమే అనడంతో అతిశయోక్తి లేదు. తిన­డానికి కొందరు..­చూడడానికి మరికొందరు ఇలా భారీ సంఖ్యలో ఆ హోటల్‌కు జనాలు బారులుతీరుతున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3 నుంచి శ్రీనగర్‌కాలనీకి వెళ్లే రోడ్డులో కర్ణాటక బ్యాంక్‌ ఎదురుగా రాఘ­వేంద్ర రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన కృష్ణ ఇడ్లీ కేఫ్‌నకు తెల్లవారు­జామునుంచే ఫుడ్డీలు చేరుకుంటున్నారు.

బంగారు పూత పూసిన ఇడ్లీని గులాబీ రేకులతో కనువిందు చేసే రీతిలో సర్వ్‌ చేస్తున్నారు. ఒక ప్లేట్‌కు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ గోల్డ్‌ ఇడ్లీలే కాకుండా బంగారు దోశ, గులాబిజామ్‌ బజ్జీ, మలాయి కోవా వంటి 100కిపైగా ఫుడ్‌ ఐటమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలే కాకుండా చైనీస్‌ వంటకాలకూ ఈ హోటల్‌ స్పెషల్‌.   
 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)