Breaking News

వానాకాలం సాగు..1.34 కోట్ల ఎకరాలు

Published on Wed, 05/15/2024 - 05:53

సాక్షి, హైదరాబాద్‌: ఈ వానాకాలం 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల ప్రణాళికను విడుదల చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉంచనున్నారు. ఈ వానాకాలం అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత పత్తి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. గతేడాది వానాకాలం సీజన్‌లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది.  

» గతేడాది 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 66లక్షల ఎకరాల్లో నాట్లు పడనున్నాయి.  

» గతేడాది 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రోత్సహించనున్నారు.  

»    వరిసాగు కంటే పత్తినే ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అవసరమైతే వరిని తగ్గించి, పత్తినే 70 లక్షల ఎకరాలకు పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం 
సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్‌కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించింది.  

»   అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు అవసరం, సోయాబీన్‌ విత్తనాలు 1.49లక్షల క్వింటాళ్లు రైతులకు అందుబాటు లోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు.

»    జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొంత మేరకు అందు బాటులో ఉంచామని, మిగిలిన వాటిని త్వరలో రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. 

»    పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో ప్రైవేట్‌ కంపెనీలే అందుబాటులోకి తీసుకొస్తాయి. అయితే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కోరుకుంటారు. ఆ మేరకు ఆయా కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీలను వ్యవసాయశాఖ ఆదేశించింది.

» ఈసారి 24.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వానాకాలం కోసం సిద్ధం చేయనున్నారు. అందు లో 10.40 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా, 10 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎన్‌పీకేను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)