Breaking News

వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

Published on Mon, 08/18/2025 - 04:47

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మొదటిదశ సంయుక్త కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌ తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారిగా బీఎస్సీ (అగ్రికల్చర్‌), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) సీట్లలో ప్రత్యేక కోటా అమలు చేస్తున్నట్టు తెలిపారు. బీఎస్సీ(అగ్రికల్చర్‌)లో 15 శాతం సీట్లు, బీఎస్సీ(ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సులో 15 శాతం సీట్లు వ్యవసాయ కూలీల పిల్లలకు కేటాయించినట్టు చెప్పారు.

విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యాభ్యాసంలో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో చదివినవారు ఈ ప్రత్యేక కోటాకు అర్హులని తెలిపారు. విద్యార్థి లేదా, వారి తల్లిదండ్రుల పేరుపై ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధిహమీ పథకం కార్డు కలిగి ఉన్నవారే ఈ కోటకు అర్హులన్నారు. పై అర్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయ వెబ్‌సైట్‌  www.pjtau.edu.in లో చూడొచ్చని రిజి్రస్టార్‌ పేర్కొన్నారు.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)