Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌.. ప్రభాకర్‌ రావుకు చెక్‌ పెట్టే ప్లాన్‌లో సిట్‌!

Published on Fri, 06/20/2025 - 11:34

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణలో ప్రభాకర్‌ రావు తమకు సహాకరించడంలేదని సిట్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ రావును పోలీసు కస్టోడియల్‌ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు.

ఎస్ఐబీ ప్రభాకర్‌ రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భాగంగా నేడు ఐదోసారి సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్‌ అధికారులు.. ప్రభాకర్‌ రావును విచారించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తమ విచారణకు ప్రభాకర్‌ రావు సహాకరించలేదని సిట్‌ అధికారులు చెబుతున్నారు. సిట్‌ అడిగిన ప్రశ్నలను ప్రభాకర్‌ రావు దాటవేస్తున్నట్టు చెబుతున్నారు. సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సిట్‌ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

ప్రభాకర్‌ రావును పోలీసు కస్టోడియల్‌ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. అలాగే, ప్రభాకర్‌ రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కూడా రద్దు చేయాలని కోరే అవకాశం ఉంది. ఇక, గతంలో ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్‌ రావును అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు  మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరోవైపు.. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్‌ చేశారని సిట్‌ ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుత డీజీపీ జితేందర్‌, నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా సిట్‌ అధికారులు ప్రభాకర్‌ రావును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ హాజరయ్యారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)