Breaking News

‘వారికి తెలియకుండా నేను ఏ పనీ చేయలేదు’

Published on Mon, 06/09/2025 - 17:19

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారి, ఎస్‌ఐబీ(special intelligence bureau) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు విచారణ ముగిసింది. సుమారు 8 గంటలపాటు ఆయన్ని ప్రశ్నించిన డీసీపీ విజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ ఆయన్ని కోరినట్లు సమాచారం. 

మరోవైపు.. ఇవాళ్టి విచారణలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా.. సిట్‌కే ఎదురు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌కు తాను ఆదేశాలు ఇవ్వలేదని.. అలా చెప్పినట్లు ఆధారాలు చూపించాలని సిట్‌ అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది. తాను ఎఫ్‌ఐబీలో పనిచేస్తున్నప్పటికీ తనపై అధికారులు ఉన్నారని.. తన పైఅధికారులకు తాను చేసిన ప్రతీ పనీ తెలుసని ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి విచారణకు రావాలని సిట్‌ కోరింది. 

తాను చేసిన ప్రతీ పనికి నిరంతర పర్యవేక్షణ ఉంటందని, వారికి తెలియకుఉండా తాను ఏ పనీ చేయలేదన్నారు.  అయితే ఎస్‌ఐబీ కార్యాలయంలో ధ్వంసమైన హార్డ్‌ డిస్క్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సిట్‌ అధికారులకు ప్రభాకర్‌రావు చెప్పలేనట్లుగా తెలుస్తోంది. 

కాగా, గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉండి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.   రాజకీయ, సినీ ప్రముఖలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకాలం అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావు సుప్రీం కోర్టు ఆదేశాలతో  నిన్న (ఆదివారం, జూన్‌8) హైదరాబాద్‌ చేరుకున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)