Breaking News

మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!

Published on Fri, 08/22/2025 - 09:17

పెద్దపల్లిరూరల్‌: పరాయి మహిళ మోజులో పడి కట్టుకున్న భార్య, కన్నబిడ్డలను పట్టించుకోని భర్తకు సఖి కేంద్రం నిర్వాహకులు కౌన్సెలింగ్‌కు యతి్నంచినా సహకరించలేదు. ఆగ్రహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాలరావు బుధవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు.

 కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన రవీందర్‌ (ఓదెల పీహెచ్‌సీలో ఫార్మసిస్ట్‌) కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా పరాయి స్త్రీ మోజులో పడిన రవీందర్‌.. భార్యాబిడ్డల పోషణ పట్టించుకోవడం మానేశాడు. పోషణ భారం కావడంతో ఆయన భార్యాపిల్లలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌.. ఆయనకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబంతో కలిసి ఉండేలా చూడాలని జిల్లా సంక్షేమశాఖ, సఖి కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.

 వారు పలుమార్లు కౌన్సెలింగ్‌ పిలిచినా సహకరించలేదు. ఉద్యోగం చేసే పీహెచ్‌సీకి వెళ్తే.. “మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో సహజీవనం చేస్తే తప్పేంటి’ అని దబాయించాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లొచ్చంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. ఈ వ్యవహారంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించారు. ఆగ్రహించిన కలెక్టర్‌.. ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి చట్టం ప్రకారం రవీందర్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.   

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)