Breaking News

Hyderabad: పెట్రోల్‌ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్‌పై పుకార్లు

Published on Tue, 01/09/2024 - 08:36

సాక్షి, హైదరాబాద్:  పెట్రోల్‌ బంక్‌లు బంద్‌ అంటూ మళ్లీ పుకార్లు వ్యాపించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్‌ కోసం బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్‌ బంకుల వద్ద క్యూ కట్టారు.

కొన్ని పెట్రోల్‌ బంకుల దగ్గర నోస్టాక్‌ బోర్డులు సైతం వెలిశాయి. అయితే, పెట్రోల్ బంక్‌లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్‌ల యాజమాన్యం స్పష్టం చేశారు.

ఇక.. ఇటీవల హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన కఠిన నిబంధనలను నిరసిస్తూ అయిల్‌ ట్రాక్కుల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్, డీజిల్‌ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్‌ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.

చదవండి: Banjara Hills: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)