Breaking News

నా కారునే ఆపుతావా..?

Published on Fri, 02/28/2025 - 09:04

పంజగుట్ట : కేవలం రూ. 4 వేల పెండింగ్‌ చలానాలు ఉంటే నా కారునే ఆపుతావా ..? నీకు ఎంత ధైర్యం అంటూ ఓ వ్యక్తి పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీసులపై వీరంగం సృష్టించాడు. నేను తలచుకుంటే ఐదు నిమిషాల్లో నిన్ను ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాను అంటూ చిందులు తొక్కాడు. అంతే కాకుండా లైసెన్స్‌ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నెంబర్‌ ఏర్పాటు చేసుకోవడం, కారు విండోలకు బ్లాక్‌ ఫిల్మ్‌ వేసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 

గురువారం మధ్యాహ్నం  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు తాజ్‌కృష్ణా నుంచి మోనప్పా సర్కిల్‌ వైపు వస్తున్న ఫ్యాన్సీ నెంబర్‌తో ఉన్న ఓ కారును గుర్తించారు. మోనప్ప సర్కిల్‌ వద్ద కారును ఆపి పెండింగ్‌ చలానాలు చెక్‌ చెయ్యడంతో రూ.4 వేలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా విండోస్‌కు బ్లాక్‌ ఫిల్మ్‌ కనిపించాయి. కారు నడుపుతున్న గచి్చ»ౌలికి చెందిన అరీఫ్‌ అనే వ్యక్తిని కారు దిగాల్సిందిగా కోరారు. దీంతో ఆరీఫ్‌ కారు దిగుతూనే తనను ఎందుకు ఆపారు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కేవలం రూ.4 వేలు పెండింగ్‌లో ఉంటే తన కారును ఆపుతారా ..?, నా ఇంట్లో ఉన్న కారుకు రూ.16 వేలు పెండింగ్‌ ,లానాలు ఉన్నాయి. 

ఇప్పటివరకు ఎవరూ అడగలేదు, నేను తలచుకుంటే ఐదు నిమిషాల్లో మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాను అంటూ వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్సై మోజీరామ్‌ అతడిని అడ్డుకుని కారును పక్కకు తీయించి కారు టైర్లకు లాక్‌ వేశారు. అతడి వద్ద లైసెన్స్‌ కూడా లేనట్లు గుర్తించిన పోలీసులు కారుకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ను తొలగించి, పెండింగ్‌ చలానా రూ.4 వేలు, లైసెన్స్‌ లేనందుకు మరో రూ.వెయ్యి చలానా విధించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు పంజగుట్ట లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)