Breaking News

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్‌

Published on Thu, 03/13/2025 - 15:02

సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్‌ పడింది. హోళీ పండుగ రోజు ఆనవాయితీగా మధ్యలో తాడు కట్టి ఇరువైపులా నిలబడి కొట్టుకునే సంప్రదాయంతో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అయితే, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అనుమతి నిరాకరించారు. గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోళీ రోజూ కొట్టుకుంటే గ్రామానికి కీడు జరగదని ఐదు నిమిషాలు అయినా అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. కొట్టుకుంటే కక్షలు పెరిగి.. గొడవలు జరుగుతాయంటున్న పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలో ఉన్న హున్సా గ్రామం పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది.

దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కులమత, వయోబేధం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాటను నిర్వహిస్తుంటారు. వసంత రుతువు రాకకు గుర్తుగా సంబురంగా నిర్వహించే హోలీ.. ఆ గ్రామంలో పిడిగుద్దులకు వేదిక అవుతుంది. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)