Breaking News

ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. చెత్త ఎలా?

Published on Sat, 02/08/2025 - 09:40

సాక్షి, హైదరాబాద్‌: విస్తరిస్తున్న నగరంతో పాటే చెత్త సమస్యలూ పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ నుంచి గతంలో రోజుకు 3,500 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడగా.. ప్రస్తుతం 7,500 మెట్రిక్‌ టన్నుల చెత్త వస్తోంది. దీని నిర్వహణ కోసం జవహర్‌నగర్‌ డంప్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తతో ఎంతో కాలంగా అక్కడి పరిసర గ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. చెరువుల కాలుష్యం తగ్గించేందుకు లీచెట్‌ ట్రీట్‌మెంట్‌ వంటి పనులు జరుగుతున్నా తమ ఆరోగ్యానికి ముప్పేనని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

ఈ నేపథ్యంలో నగరంలోని చెత్త మొత్తం ఒకేచోట పోగు పడకుండా ఉండేందుకు నగరానికి నాలుగు వైపులా డంపింగ్‌ యార్డులు, చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాయి. దశాబ్దం క్రితం నుంచే ఆ దిశగా చర్యలు ప్రారంభమైనా, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలతో అవి ముందుకుసాగడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా పరిధిలోకొచ్చే నగర శివార్లలోని ప్యారానగర్‌లో ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రానికీ అదే పరిస్థితి ఎదురవుతోంది. పనులకు సాగనీయకుండా గత నాలుగు రోజులుగా పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.  

బతుకులు బలి చేస్తారా? 
అక్కడ అత్యాధునిక సాంకేతికతతో యూరోపియన్‌ దేశాల్లోని చెత్త నిర్వహణ పద్ధతుల్ని  పాటిస్తామని, దాని వల్ల పరిసరాల్లో ఎలాంటి కాలుష్యం వ్యాపించదని చెబుతున్న జీహెచ్‌ఎంసీ అధికారుల మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు. నగరంలోని చెత్తతో తమ బతుకులు బలి చేస్తారా? అని ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏం కానుందన్నది  మున్ముందు తేలనుంది.  

అక్కడ ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రం గురించి జీహెచ్‌ఎంసీ అధికారులేమంటున్నారంటే.. 
⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో  స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఫెసిలిటీతో ఏర్పాటు కానున్న ప్లాంట్‌లో  అడ్వాన్స్‌డ్‌ డ్రై అనరోబిక్‌ బయోమిథనేషన్‌ టెక్నాలజీ (డీఏబీటీ)తో తడిచెత్త నుంచి  బయోగ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. కంపోస్టు ఎరువు తయారవుతుంది. 
⇒ఆర్‌డీఎఫ్‌(రెఫ్యూజ్‌ డిరైవ్డ్‌ ఫూయెల్‌) ప్రాసిసెంగ్‌ తో  పొడిచెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. 
⇒ జవహర్‌నగర్‌లో పుష్కరకాలంగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన, కాలుష్యం వంటి సమస్యలుండగా, ప్యారానగర్‌ ప్లాంట్‌లో అలాంటి సమస్యలుండవు.  
⇒ చెత్త అనేది అసలు నిల్వ లేకుండానే ఎప్పటికప్పుడు ప్రాసెస్‌ అవుతుంది. చెత్త బహిరంగంగా కనిపించదు. 
⇒ డీఏబీటీతో వెలువడే బయోగ్యాస్‌ను ఇంధనంగా లేదా విద్యుత్‌   ఉత్పత్తికి వినియోగించవచ్చు. ఆర్‌డీఎఫ్‌ను విద్యుత్‌ తయారీకి ఉపయోగిస్తారు. 
⇒ ఈ ప్లాంట్‌లో పనులన్నీ భూమిలోపల బంకర్లలో, మూసివేసిన షెడ్లలో జరుగుతాయి. చెత్త రవాణా సైతం ఆయిల్‌ ట్యాంకర్ల మాదిరిగా పూర్తిగా మూసి ఉండే వాహనాల ద్వారా జరుగుతుంది. గాలిని కూడా బయో ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేయడం వల్ల ఎలాంటి దుర్వాసనలు రావు. 
⇒ డ్రై డైజెసన్‌ టెక్నాలజీ వల్ల లీచెట్‌ (విష జలాల) సమస్య ఉండదు. చెత్త నిర్వహణలో పర్యావరణపరంగా  మేలైనది. అక్కడ ఉత్పత్తయ్యే  విద్యుత్‌ స్థానిక అవసరాలకు సరిపోతుంది. 
⇒ రోజుకు 2 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తతో 15 మెగావాట్ల విద్యుత్, 270 టన్నుల బయోగ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది.  

చెత్తను మోయలేని జవహర్‌నగర్‌ 
నగరం నుంచి ప్రస్తుతం వెలువడుతున్న దాదాపు 7,500 మెట్రిక్‌ టన్నుల చెత్తతో పాటు శివార్లలోని మున్సిపాలిటీల చెత్త అక్కడికే వెళ్తోంది. జవహర్‌నగర్‌ఫై పడుతున్న ఈ భారాన్ని  తగ్గించే చర్యల్లో భాగంగా నలువైపులా చెత్త నిర్వహణ ఏర్పాటు కేంద్రాలకు ఎప్పటినుంచో ఆలోచనలున్నాయి.  

జీహెచ్‌ఎంసీలో ఒక వ్యక్తి నుంచి రోజుకు వెలువడుతున్న చెత్త  

2019లో  500 గ్రాములు 
2024లో 733 గ్రాములు

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలుతున్న చెత్త  
2014లో 3,500 మెట్రిక్‌ టన్నులు 
2024లో 7,500 మెట్రిక్‌ టన్నులు  

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ చెత్త 9వేల మెట్రిక్‌ టన్నులకు పెరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరానికి నాలుగువైపులా డంపింగ్‌ కేంద్రాలు, చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుతో జవహర్‌నగర్‌పై భారం తగ్గుతుంది.   

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)