Breaking News

ట్రాఫిక్‌ రద్దీ.. ఏడాదిలో 85 గంటలు!

Published on Wed, 11/12/2025 - 02:47

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్‌ రద్దీ. ఏడాదిలో మనం ట్రాఫిక్‌లో గడిపే సమయం ఎంతో తెలుసా? 85 గంటలు. నగరంలో 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాల 30 సెకన్లు. అయితే బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే ట్రాఫిక్‌ రద్దీలో గడిపే సమయం మన దగ్గరే తక్కువ కావడం కాస్త ఊరట కలిగించే అంశం. వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం, ట్రాఫిక్‌ క్రమశిక్షణ లేకపోవడం, అధ్వానమైన రహదారులు, ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగకపోవడం వంటివి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీకి ప్రధాన కారణాలు. 

కి.మీ.కు 9,500 వాహనాలు 
ట్రాఫిక్‌ సంక్షోభం కూడా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా పరిణమించింది. ఒకప్పుడు స్వచ్ఛమైన గాలి ఉండే మహా నగరాలు.. ఇప్పుడు కాలుష్య కారకాలుగా మారాయి. దేశంలో అత్యంత రద్దీ కలిగిన ఆరో నగరంగా హైదరాబాద్‌ అవతరించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 85 లక్షలకు పైగా వ్యక్తిగత వాహనాలున్నాయి. కిలోమీటరుకు దాదాపు 9,500 వాహనాల సాంద్రత ఉంది. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యాలయాలు, విద్యాసంస్థల పనివేళల్లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది. 

ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న సమయాన్ని పీక్‌ అవర్స్‌గా పరిగణిస్తారు. ఆ సమయంలో వాహనాల సగటు వేగం చాలా తక్కువగా ఉంటుంది. 2024 ప్రారంభంలో వాహనాల సగటు వేగం గంటకు 18 కి.మీ.గా ఉంది. ఇందులోనూ ఉదయం రద్దీ సమయంలో వాహనాల వేగం గంటకు 17.8 కి.మీ.గా ఉండగా.. సాయంత్రం వేళల్లో గంటకు 15.6 కి.మీ.కు తగ్గింది.  

ప్రధాన ట్రాఫిక్‌ హాట్‌స్పాట్లు 
ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, మెహదీపట్నం, ఎల్బీనగర్, ఉప్పల్‌  

ఏం చేయాలంటే.. 
–ప్రతీ చిన్న అవసరానికి వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలి.  
–రోడ్లపై వాహనాలు సజావుగా సాగేలా అక్రమ పార్కింగ్‌లను తొలగించాలి. 
–ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 
–ఆర్టీసీ బస్‌లు, ఎంఎంటీఎస్, మెట్రో వంటి ప్రజా రవాణాను విరివిగా వినియోగించాలి.  
–చిన్న వయసు నుంచే ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలి. 
–అత్యవసరమైతే తప్ప పీక్‌ అవర్స్‌లో ప్రయాణం చేయొద్దు.  
–నావిగేషన్‌ యాప్‌లను వినియోగిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమం. 

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు