Breaking News

కోవిడ్‌పై ఆందోళన వద్దు

Published on Sun, 05/25/2025 - 00:42

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భరోసా ఇచ్చారు. కోవిడ్‌ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ శాఖ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు దేశంలో నమోదవుతున్న కేసులు సాధారణమైనవేనని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, సీజనల్‌ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్, సీజనల్‌ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జలుబు, దగ్గు లాగే కోవిడ్‌ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. మాస్కు ధరించడం వంటి చర్యల ద్వారా వైరస్‌ల వ్యాప్తిని నిరోధించొచ్చని చెప్పారు. 

ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అన్ని ఆస్పత్రుల్లో సరిపడా మందులు, రీఏజెంట్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కోవిడ్, డెంగీ పేరిట ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల్ని దోచుకొనే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దామోదర స్పష్టం చేశారు. 

జేఎన్‌–1 వేరియంట్‌తో ఆందోళన అక్కర్లేదు 
దేశంలో కోవిడ్‌ జేఎన్‌–1 వేరియంట్‌ కేసులు కొన్ని నమోదయ్యాయని.. ఈ వేరియంట్‌ 2023 నుంచే దేశంలో వ్యాప్తిలో ఉందని అధికారులు మంత్రి దామోదరకు వివరించారు. ఈ వేరియంట్‌ వల్ల ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితులేమీ లేవన్నారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి తప్పితే ఇతరులెవరికీ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం పడటం లేదన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా నమోదయ్యే కోవిడ్‌ కేసులను ఎదుర్కొనేందుకు టెస్టింగ్‌ కిట్స్, మెడిసిన్‌ సహా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)