Breaking News

పండుగ ముందే ధరల దడ

Published on Sun, 01/12/2025 - 03:07

సంకాంత్రి పండుగ ముందే నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజలు మండిపడుతున్నారు. సగం సరుకులు కూడా కొనలేకపోతున్నామని వాపోతున్నారు. –సాక్షి, నెట్‌వర్క్‌

సరుకుల ధరలు భారీగా పెరిగాయి..
గతేడాదితో పోలిస్తే బియ్యం. గోధుమ పిండి, వంటనూనెలు, బెల్లం, చక్కెర, నెయ్యి వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. నూనె ధరలు మరికాస్త పెరిగాయి. వంట నూనెల కొనుగోళ్లు తగ్గాయి. ధరలు పెరగటం వల్ల ప్రజలు పిండివంటలు తగ్గించారు. సామాన్య ప్రజలు అయితే పండుగ సరుకులు కొనటానికి వెనకాడుతున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది లాభాలు తగ్గాయి. తెచ్చిన ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్నాం – కుసుమ తారాబాయి, తిలక్‌రోడ్డు, వరంగల్‌

అన్ని రకాల పిండివంటలు చేసుకోలేకపోయాం..
సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటాం. పాఠశాల లకు సెలవులు రావడంతో మూడు రోజులముందే బంధువులు ఇంటికి వచ్చారు. వారు వచ్చేలోపే అన్ని సిద్ధం చేసి ఉంచాలనే ఆలోచనతో పిండివంటల తయారీలో మునిగిపోయాం. సరుకుల ధరలు పెరగడంతో అన్ని రకాల పిండివంటలు చేయలేకపోతున్నాం. – బి.రమేష్, ఫోర్ట్‌ రోడ్డు, వరంగల్‌

నిత్యావసర ధరలు తగ్గించాలి..
పండుగ చేసుకోవాలనుకుంటు న్నా.. పెరిగిన ధరలతో ఏమి కొనేటట్టు లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టడంతో ఆశించినంతగా చేతిలో ఆదాయం లేకపోవడంతో కూడా గ్రామాల్లో పండుగ వాతావరణం కళ తప్పింది. ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – గొట్టిముక్కల సాంబరాజు, వేలేరు, హనుమకొండ జిల్లా

గిరాకీ లేదు, సరుకులు తేలే.. 
రోజుకు 7 నుంచి 8 ట్రిప్పులు నడిచే ఆటో ఇప్పుడు జీరో టికెట్‌ వల్ల సగానికి పడిపోయింది. ఫైనాన్స్‌కు సరిపోయే డబ్బులు కూడా వస్తలేవు. సంక్రాంతి పండుగకు నాలుగు రోజుల ముందుగానే బిజీగా ఉండాల్సిన సమయంలో గిరాకీ లేక కాలక్షేపం చేస్తున్న. ఒకప్పుడు అన్నీ ఖర్చులు పోను రోజుకు రూ.1,200, రూ.1,400 వచ్చేవి.. ఇప్పుడు రూ.400 మిగలడం లేదు. గత ఏడాది పండుగతో పోల్చితే, ఈసారి ఏమాత్రం లాభం లేదు. ఇంట్లో కనీసం సరుకులు కూడా తేలేదు.  – కె.ప్రభాకర్, ఆటోడ్రైవర్, జనగామ

పండుగ గిరాకీ ఈసారి అంతంత మాత్రమే..
సంక్రాంతి పండుగ వాతావరణం పల్లెల్లో అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కిరాణా షాపుల్లో గిరాకీ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువే. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు కూడా పిండి వంటలపై ఆసక్తిని తగ్గించుకున్నారు. అరకొరగా చేసుకుంటున్నారు. దీంతో గిరాకీ మామూలుగానే ఉంటుంది. – కొయ్యడ రవీందర్, ఓ మార్ట్‌ యాజమాని, వేలేరు

సగానికి పడిపోయింది
సంక్రాంతి సీజన్‌లో రోజుకు రూ.70 వేల వరకు సరుకులు అమ్మేది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో రోజుకు రూ. 35 వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. గతంతో పోల్చితే ధరలు పెరగడం ఒక కారణం అయితే మాల్స్, సూపర్‌ మార్కెట్‌లతోపాటు ఆన్‌లైన్‌తో మా గిరాకీ పూర్తిగా పడిపోయింది. - చంద్రశేఖర్, కిరాణా షాప్‌ యజమాని, సిద్దిపేట

ధరలు పెరిగిపోయాయి....
నిత్యావసర సరుకుల ధరలు భాగా పెరిగి పోయాయి. దీంతో ఖర్చు ఎక్కువైంది. పప్పులు, నూనెలకు ధరలు పెరగడంతో పిండివంటలు చేసుకోవాలంటేనే భయమేస్తుంది. మాది పెద్ద కుటుంబం...మా పిల్లల కోసం సంక్రాంతికి అప్పాలు చేయాలి. ఇతర ఖర్చులు తగ్గించుకొని గతేడాది కంటే తక్కువగా అప్పాలు చేసుకుంటున్నాం. – చంద్రకళ, సిద్దిపేట 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)