Breaking News

సాంబార్‌ గిన్నెలో పడి బాలుడి మృతి

Published on Tue, 12/09/2025 - 11:50

ధర్మారం:  పెద్దపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. తన బర్త్‌డే నాడే నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సాంబార్‌ గిన్నెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు వేడుక జరిపేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కుమారుడు కానరాని లోకాలకు వెళ్లడం పుట్టెడు దుఃఖాన్ని మిగిలి్చంది. ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మొగిలి మధుకర్‌ ఏడాదిన్నరగా మల్లాపూర్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులంలో తాత్కాలిక పద్ధతిన వంటమనిషిగా పనిచేస్తున్నాడు. మధుకర్‌ భార్య శారద, కూతురు శ్రీమహి(8), కుమారుడు మోక్షిత్‌(4)తో కలిసి విద్యాలయంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం వంటగదిలో మధుకర్‌ వంట తయారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కాసేపటికి సాంబారు వండి పక్కన పెట్టాడు.

 అతడి కుమారుడు మోక్షిత్‌ ఆడుకుంటూ వంట గదిలోకి వెళ్లాడు. అకస్మాత్తుగా వేడి సాంబారు పాత్రలో పడిపోయాడు. వేడితీవ్రతకు గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తండ్రి మధుకర్‌.. తొలుత కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం బాలుడు మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. బర్త్‌డే రోజే తమ కుమారుడు కళ్లెదుటే గాయపడి మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బంధువులు రోదించిన తీరు కలచివేఇంది.  

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)