Breaking News

HYD: ఒక్కసారిగా కుంగిన భూమి.. నడిరోడ్డుపై భారీ గుంత

Published on Fri, 09/13/2024 - 20:07

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో, రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక, తాజాగా చందానగర్‌లో రోడ్డు మధ్యలో ఒక్కసారిగా భారీ గుంత పడింది. దీంతో, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

వివరాల ప్రకారం.. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీ నుంచి ధర్మపురి క్షేత్రం మార్గంలో శాంతినగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో కుంగి భారీ గుంత ఏర్పడింది. దీంతో, ఈ ఘటనపై స్థానికులు.. జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులకు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అయితే, రోడ్డు కుంగి గుంత ఏర్పడిన చోట తాగునీటి పైపు లైన్, డ్రైనేజీ పైపు లైన్లు ఉన్నాయి. దీంతో రహదారి మధ్యలో గుంత ఏర్పడి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులు అటు వైపు వచ్చి ప్రమాదాలు బారిన పడకుండా గుంత చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్‌ రైళ్లు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)