Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సూపర్‌ ట్విస్ట్‌.. ప్రభాకర్‌, శ్రవణ్‌ రావుకు బిగ్‌ షాక్‌!

Published on Sat, 10/26/2024 - 08:12

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. దీంతో, వారిద్దరూ దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం రానుంది.

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావు పాస్‌పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. కాగా, అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్ట్ రద్దు చేయాలని పోలీసులు.. పాస్‌పోర్టు అథారిటీకి లేఖ రాశారు. దీంతో, పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్‌ రావు పాస్‌పోర్టులను అధికారులు రద్దు చేశారు.  

ఇదే సమయంలో నిందితుల పాస్‌పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు సిటీ పోలీసులు. మరోవైపు.. అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. పాస్‌పార్ట్‌ రద్దు, రెడ్‌ కార్నర్‌(ఇంటర్‌పోల్‌) నోటీసులు కీలకంగా మారనున్నాయి. ఇక, ఇప్పటికే ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది. 

ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో ఉన్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఏ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు అడుగు పెట్టగానే ముందుగా మాకు సమాచారం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)