Breaking News

సికింద్రాబాద్‌ చేరుకున్న ఫలక్‌నుమా.. ప్రయాణీకులు చెబుతున్నది ఇదే.. 

Published on Fri, 07/07/2023 - 15:30

సాక్షి, సికింద్రాబాద్‌: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ చేరుకుంది. ప్లాట్‌ఫ్లామ్‌-1పైకి ఫలక్‌నుమా రైలు చేరుకుంది. అగ్నిప్రమాదం అనంతరం.. 11 బోగీలతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌కు చేరుకుంది. అనంతరం, రైల్వే అధికారులు ప్రయాణీకులు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. 

ఇక, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఛార్జింగ్‌ పాయింట్‌ దగ్గర సిగరెట్‌ తాగడం వల్లే ప్రమాదం జరిగింది. అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. రైలులో సిగరెట్లను స్నాక్స్‌ అమ్ముతున్నట్టుగా అమ్ముతున్నా టీటీ సహా ఎవరూ పట్టించుకోలేదు. సిగరెట్లు, గుట్కాలను రైలు అమ్ముతున్నారు. 

ఎవరో చైన్‌ లాగడంతో రైలు ఆగింది. ముందుగా ఎస్‌4 బోగీలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రైలు నుంచి పరుగులు తీశాం. మా లగేజీ మొత్తం కాలిబూడిదైపోయింది. వస్తువులు, బ్యాగులు, డబ్బులన్నీ కాలిపోయాయి. పగలు ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రాత్రి సమయంలో అయితే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు. 

ఇదిలా ఉండగా.. హౌరా నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఒక బోగిలో మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించిన ఓ ప్రయాణీకుడు వెంటనే చైన్‌ లాగడంతో రైలు ఆగింది. దీంతో, ఆ బోగిలో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. మిగతా బోగీల ప్రయాణికులను సైతం కిందకు దింపారు. చూస్తుండగానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. చైన్‌ లాగకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది అంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, చైన్‌లాగిన వ్యక్తి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మంటలు అంటుకున్నపుడు భయపడి ఆందోళనకు గురయ్యాడో ఏమో మొత్తం మీద అతన్ని రైల్వే సిబ్బంది ఆసుత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చైన్‌ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని తెలుస్తున్నది.

ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు