Breaking News

హైదరాబాద్‌లో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం

Published on Mon, 08/19/2024 - 04:48

సాక్షి, హైదరాబాద్‌: సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సర్దార్‌ పాపన్నగౌడ్‌ మహారాజ్‌ 374వ జయంతి వేడుకలలో భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాపన్నగౌడ్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. 

సర్దార్‌ పాపన్న ఆనాడే సామాజికంగా వెనుకబడిన వారిని కలుపుకొని రాజ్యాధికారం కోసం అడుగులు ముందుకు వేశారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో సమానత్వం లభించేలా పోరాడారన్నారు.  సర్దార్‌ సర్వాయి పాపన్న స్వగ్రామం సర్వాయిపేటను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకోసం రూ.4.7 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. పాపన్న సేవలకు గుర్తుగా హైదరాబాద్‌ నడిబొడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

అలాగే అయన జీవిత చరిత్రపై బుక్‌లెట్‌ను ప్రచురించనున్నట్లు భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మహిళా కమిషన్‌ చైర్మన్‌ నేరెళ్ల శారద, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కష్ణమోహన్, హస్తకళా కార్పొరేషన్‌ చైర్మన్‌ నాయుడు సత్యనారాయణ గౌడ్, బీసీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, బీసీనేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సర్వాయి పాపన్న జీవితం నేటి తరానికి ఆదర్శం
రాజ్యాధికారం కోసం బడుగులను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను జయించిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం పాపన్న గౌడ్‌ 374వ జయంతి వేడుకలు టీపీసీసీ కల్లుగీత విభాగం ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. మంత్రి పొన్నంతో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, కల్లుగీత విభాగం అధ్యక్షుడు నాగరాజు గౌడ్‌ తదితరులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పాపన్నగౌడ్‌ జీవితం గురించి నేటి తరాలు తెలుసుకోవాలని, ఆయన బాటలో నడవాలని కోరారు. పాపన్న స్వగ్రామానికి నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిధుల విడుదలకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావులకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

Videos

హౌస్ అరెస్టులతో అడ్డుకట్ట వేస్తారా? పోలీసులపై MLC రమేష్ ఫైర

YSRCP అభ్యర్థికి వార్నింగ్.. నామినేషన్లపై బెదిరింపుల ఆడియో వైరల్

మేయర్ గా గెలిచిన వెంటనే నేను చేయబోయే మొదటి పని...

రూ.5 లక్షలతో రూ.80 లక్షలు.. ఇదే ఆ సింపుల్ ట్రిక్

గాల్లో ఎగురుతూ ఆఫీసుకు! అమెరికా వ్యక్తి వెరైటీ జర్నీ..

గరివిడి లక్ష్మి చూసి.. పవన్, రవితేజ ఫిదా!

DSP ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

ఓటమి భయంతోనే.. చంద్రబాబు అండ్ కో దాడులు

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

Photos

+5

అల్లు శిరీష్-నయనిక జపాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)