Breaking News

ఏసీబీకి చిక్కిన కార్యదర్శి.. గ్రామస్తుల సంబరాలు

Published on Sat, 08/30/2025 - 07:38

వీణవంక(హుజూరాబాద్‌): కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. దీంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇంటినంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది.

 తర్వాత తమ పనికోసం పంచాయతీ కార్యదర్శి నాగరాజును సంప్రదించింది. అయితే నాగరాజు నెల రోజులుగా వారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందించకుండా, రూ.20 వేలు ఇస్తేనే ఇంటి నంబర్‌ మంజూరు చేస్తానని చెప్పాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యాలయంలో వారు కార్యదర్శికి రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

టపాసులు పేల్చి సంబరాలు
జీపీ కార్యదర్శి నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారనే విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్దఎత్తున జీపీ వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ విజయ్‌కుమార్‌.. నాగరాజు అరెస్టు వివరాలు వెల్లడిస్తుండగానే గ్రామస్తులు చప్పట్లతో అవినీతి అధికారి పీడ పోయిందని నినాదాలు చేశారు. ఆనంతరం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. నాగరాజు అంతకు ముందు లంచాలకోసం పలువురిని వేధించాడని వారు తెలిపారు. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)