Breaking News

వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య

Published on Wed, 01/28/2026 - 09:10

గంగారం: మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు  జిల్లాలోని ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు  పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. 

పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. 

సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గిరిజనులు, గిరిజనేతరుల నమ్మకం. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు వలంటీర్లుగా పనిచేశారు. మంత్రి ధనసరి సీతక్క ,మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్‌పర్సన్‌ సుకన్య, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు వినయ్, సూర్యప్రకాశ్, ఎస్సై రవికుమార్, రాజ్‌కుమార్, ఎండోమెంట్‌ ఈఓ వీరస్వామి, రూరల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ నారాయణరెడ్డి పూజలు చేశారు.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)