Breaking News

నోటికందే కూడు నీటిపాలు!

Published on Sat, 11/02/2024 - 06:07

మెదక్‌/ సిరిసిల్ల/ వీర్నపల్లి/ రుద్రంగి/ నిర్మల్‌/ వాజేడు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చా­యి. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నీటి పాలవగా.. కొన్నిచోట్ల కోతకు వచ్చిన వరిపంట పొలాల్లోనే నేలకొరిగింది. దీనితో అన్నదా­తలు ఆందోళనలో పడిపోయారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి ఇన్నిరో­జులైనా ఇంకా కొను­గోళ్లు ఊపందుకోలేదని.. వర్షాలతో తమ ధాన్యం తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసు­్తన్నారు. ఇప్పటికే ఆరిపోయి తేమశాతం తగ్గిన వడ్లు కూడా వర్షానికి తడిశా­యని, మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోందని వాపోతు­న్నారు. ప్రతీ గింజ కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మండిపడుతున్నారు.

తడిసిపోయిన ధాన్యం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 156 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా కురిసిన వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వీర్నపల్లి, రుద్రంగి మండల కేంద్రాల్లో టార్పాలిన్లు లేకపోవడంతో వడ్లు తడిసిపోయాయి. రుద్రంగి మండలం పరిధిలో రైస్‌మిల్లర్లు ధాన్యం దింపుకోబోమని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు.

⇒ మరోవైపు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. దుబ్బాక, మెదక్, నర్సాపూర్, కొల్చారం, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్, నిజాంపేట, హత్నూర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. వర్షాల నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.

⇒  నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం గంటకుపైగా వాన కురిసింది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపైకి వరద చేరింది. కుంటాల మండలంలో కోతకు వచ్చిన వరి నేలవాలింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి, జైపూర్‌ మండలాల్లో సుమారు 4000 ఎకరాలకుపైగా వరి నేలవాలింది. భీమిని, కన్నెపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో పత్తి తడిసిపోయింది.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి
రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో పత్తి ఏరుతుండగా పిడుగుపడి గడ్డం నాగమ్మ (26) అనే మహిళ మృతి చెందింది. ఇక ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురంలో వ్యవసాయ భూమిలో ఎడ్లను మేపుతుండగా పిడుగుపాటుకు గురై సొనప నవీన్‌ (24) మృతి చెందాడు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)