Breaking News

నిన్న హత్య.. నేడు అంత్యక్రియలు

Published on Mon, 03/17/2025 - 08:56

జగిత్యాలక్రైం: క్షణికావేశంలో ఇంటిపెద్దను భార్య, కొడుకులు, కూతురు, అల్లుడు హత్య చేశారు. క్షణికావేశం నుంచి తేరుకున్నాక తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకులు, కూతురు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల వివరాలు.. జగిత్యాల రూరల్‌ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్‌ (58)పై మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కూతురు శిరీష, అల్లుడు శోభన్‌ కలిసి క్షణికావేశంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో చికిత్స పొందుతూ కమలాకర్‌ మృతిచెందగా అతడి బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు.

 దీంతో ఆదివారం కొంత మంది సన్నిహితుల మధ్య పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని పొలాసకు తరలించారు. దీంతో హత్యలో ప్రమేయం ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌లో ఉండటంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మానవత్వం చాటిన పోలీసులు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య మొదటి భార్య జమున, కొడుకులు చిరంజీవి, రంజిత్, కుమార్తె శిరీష, అల్లుడు శోభన్‌ను పొలాసకు తీసుకెళ్లారు. దీంతో వారంతా కమలాకర్‌ మృతదేహంపై పడి రోదించడంతో స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి చితికి నిప్పంటించాడు. అంత్యక్రియల అనంతరం నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

మృతుడి ఇంట్లో ఆయుధాలు
కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన పడాల కమలాకర్‌ ఇంట్లో ఆదివారం పోలీసులు పరిశీలించగా భారీ ఆయుధాలు లభ్యమయ్యాయి. తల్వార్లతో పాటు కత్తులు, రాడ్లు కన్పించడంతో పోలీసులు బిత్తరపోయారు. కమలాకర్‌ పక్కా ప్రణాళికతోనే కొన్నేళ్లుగా మారణాయుధాలు వెంట ఉంచుకుంటూ తిరిగాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. 

నిందితుల రిమాండ్‌
జగిత్యాల రూరల్‌ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్‌ (58)పై పెట్రోల్‌ పోసి నిప్పంటించి మృతికి కారణమైన ఐదుగురిని ఆది వారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలి పారు. కుటుంబ కలహాలతో మొదటి భార్య జమున, పెద్ద కొడుకు చిరంజీవి, చిన్న కొడుకు రంజిత్, కుమార్తె శిరిష, అల్లుడు శోభన్‌బాబు కలిసి కమలాకర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందగా అతడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదయింది. సమావేశంలో రూరల్‌ ఎస్సై సధాకర్‌ పాల్గొన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)