Breaking News

దివ్యాంగుడికి ‘గృహలక్ష్మి’ చేయూత 

Published on Mon, 08/14/2023 - 04:20

భూదాన్‌ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చుక్క నరేశ్, పావని దంపతులు గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోనే మొదటి ప్రొసీడింగ్‌ను అందుకున్నారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి.. నరేశ్‌ ఇంటికి వెళ్లి రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు.

శనివారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌.. కళాపునర్వి హ్యాండ్లూమ్‌ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా అక్కడ మగ్గం పనిచేస్తున్న చుక్క పావని, నరేశ్‌ కుటుంబం దీనస్థితిని తెలుసుకొన్నారు. వారికి సొంత ఇల్లు లేదని తెలుసుకొని వెంటనే స్పందించిన మంత్రి.. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ప్రొసీడింగ్‌ను అందజేయాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డితో కలసి నరేశ్‌ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్‌ కాపీని అందజేశారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు తమ సొంతింటి కల నెరవేరనుండటంతో ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలలక్ష్మిశ్రీనివాస్, సర్పంచ్‌ కోట అంజిరెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్‌ పాల్గొన్నారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)