Breaking News

అధిక ఉష్ణోగ్రత... ఆపై ఉక్కపోత! 

Published on Sun, 04/28/2024 - 04:24

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు మాడుపగిలే ఎండ, వడగాడ్పులు... మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. ఇదీ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణ పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్‌లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతున్నాయి. 

పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. 
♦ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. 

ప్రచండ భానుడు.. 
రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లురులో 45.2 డిగ్రీల సెల్సీయస్‌ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌లో 43.5 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించి నమోదయ్యాయి.

మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 3.2 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మిగతా ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్‌ నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పెద్దలు, పిల్లలు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

ఆకు రాల్చిన అభయారణ్యం 
వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల అభయారణ్యం వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అన్ని రకాల జంతువులు, పక్షులకు నిలయమిది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పచ్చదనంతో అన్ని రకాల పక్షుల అలజడితో చూడముచ్చటగా ఉండేది. వేసవిలో మండుతున్న ఎండలతో చెట్లన్నీ ఆకురాలడంతో అటవీ ప్రాంతమంతా బోసిపోయి ఇలా కనిపిస్తోంది.      – నర్సంపేట 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)