Breaking News

ఒంటరి మహిళా ప్రయాణికుల కోసం ‘ఆపరేషన్‌ మేరీ సహేలి’ 

Published on Fri, 08/11/2023 - 02:19

సాక్షి, హైదరాబాద్‌: మహిళా ప్రయాణికుల భద్రతపై దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్‌ మేరీ సహేలీ’పేరిట ప్రత్యేక రక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. దక్షిణమధ్య రైల్వేలోని 20 ప్రధాన స్టేషన్‌లలో ఈ బృందాలను రంగంలోకి దించింది. –సాధారణంగా మహిళలు ఒంటరిగా దూరప్రయాణాలు చేయవలసి వచ్చి నప్పుడు కొంత అభద్రతాభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

అలాంటి వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారి ప్రయాణం పూర్తయ్యే వరకు రక్షణ కల్పి0చే లక్ష్యంతో మేరీ సహేలీ మహిళా భద్రతా సిబ్బంది ప్రయాణికులతో పాటు రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఇందుకోసం మహిళా సిబ్బందికి వివిధ అంశాలలో శిక్షణనిచ్చినట్లు ఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు. మహిళా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు సహకరిస్తారు. స్టేషన్‌ లేఅవుట్‌పైన అవగాహన కల్పి స్తారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు సహాయం చేస్తారు. 

ఏయే స్టేషన్లలో ఈ సేవలంటే...  
సికింద్రాబాద్‌ డివిజన్‌లో 5 స్టేషన్లు, హైదరాబాద్‌ డివిజన్‌లో 2, విజయవాడలో 4, గుంతకల్‌లో 4, గుంటూరులో ఒక స్టేషన్, నాందేడ్‌లో 4 స్టేషన్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. 2 నుంచి 24 మంది సభ్యుల బృందానికిమహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాయకత్వం వహిస్తారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 15 రైళ్లతో పాటు, ఇతర జోన్‌లకు చెందిన మరో 35 రైళ్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ సహేలీ సేవలను ప్రశంసించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)